రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో శ్రీలంక, న్యూజిలాండ్‌ను 154 పరుగుల భారీ తేడాతో ఓడించింది. ఈ విజయంతో శ్రీలంక తన గడ్డపై రెండోసారి టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్‌ను క్లీన్ స్వీప్ చేసింది. అంతకుముందు 2009లో శ్రీలంక టెస్ట్ సిరీస్‌లో కివీ జట్టును క్లీన్ స్వీప్ చేసింది. తాజాగా.. 15 సంవత్సరాల తర్వాత శ్రీలంక తన చారిత్రక విజయాన్ని రిపీట్ చేసింది. శ్రీలంక ఈ విజయం తర్వాత.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.
Venkaiah Naidu: ఎంత కాలం బ్రతికాం అని కాదు.. ఎలా బ్రతికాం అనేది ముఖ్యం
పాయింట్ల పట్టికలో శ్రీలంక స్థానం మరింత పటిష్టంగా మారి మూడో స్థానంలో కొనసాగుతోంది. శ్రీలంక జట్టు 2023-25 సైకిల్‌లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 5 గెలిచింది, 4 మ్యాచ్‌లు ఓడిపోయింది. శ్రీలంక గెలుపు శాతం ఇప్పుడు 55.56గా ఉంది. మరోవైపు.. శ్రీలంక చేతిలో రెండు వరుస పరాజయాల తర్వాత, న్యూజిలాండ్ జట్టు 7వ స్థానంలో ఉంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌లలో 3 గెలిచింది. 5 మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఈ జట్టు విజేత శాతం ప్రస్తుతం 37.50 ఉంది. కాగా.. తర్వాత న్యూజిలాండ్ భారత్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది.
Nimmala ramanaidu: టిడ్కో గృహాలను జగన్ ప్రభుత్వం గాలికి వదిలేసింది..
శ్రీలంక విజయం తర్వాత భారత్ స్థానంలో ఎలాంటి మార్పు లేదు. దీంతో టీమిండియా పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో భారత్ 7 గెలిచింది. 2 ఓడిపోయింది, ఒక మ్యాచ్ డ్రా అయింది. భారత్ విజేత శాతం 71.67 ఇది అత్యధికం. ఈ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా జట్టు భారత్ కంటే కొంచెం దిగువన ఉంది, విజయ శాతం 62.50. ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో ఈ జట్టు 8 మ్యాచ్‌లు గెలవగా, 3 ఓడిపోయి ఒక మ్యాచ్ డ్రా అయింది. ఈ పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్ నాలుగో స్థానంలో ఉండగా.. బంగ్లాదేశ్ 5వ స్థానం, దక్షిణాఫ్రికా ఆరో స్థానంలో ఉంది. ప్రస్తుతం పాకిస్థాన్ 8వ స్థానంలో, వెస్టిండీస్ 9వ స్థానంలో ఉన్నాయి.