వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక, న్యూజిలాండ్ జట్లు పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ తీసుకుంది.
ప్రపంచ కప్ 2023లో భాగంగా ఈరోజు న్యూజిలాండ్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో పాక్.. డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో వర్షం రెండుసార్లు రావడంతో అంఫైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదటిసారి వర్షం పడినప్పుడు ఓవర్లను 41కి కుదించగా, లక్ష్యాన్ని కూడా 342కు తగ్గించారు. ఈ క్రమంలో మరోసారి వర్షం పడుతుండటంతో పాకిస్తాన్ విజేతగా ప్రకటించారు.
ప్రపంచకప్ 2023లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్-పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో ఇప్పటికే వరుణుడు ఒక్కసారి అడ్డుతగలగా.. మరోసారి ప్రత్యక్షమయ్యాడు. దీంతో మళ్లీ ఆటను ఆపేశారు.
న్యూజిలాండ్-పాకిస్తాన్ మ్యాచ్కు వర్షం అడ్డంకి తగిలింది. దీంతో మ్యాచ్ ఆగిపోయింది. అయితే ఒకవేళ ఇలానే వర్షం పడితే మ్యాచ్ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాకిస్తాన్ జట్టుకు కలిసొచ్చే అవకాశముంది. డీఎల్ఎస్ ప్రకారం చూసుకుంటే.. పాకిస్తాన్ 10 పరుగులు ఎక్కువ సాధించింది. ఈ క్రమంలో ఒకవేళ మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే, పాకిస్తాన్ ను విజేతగా ప్రకటిస్తారు.
న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆడుతున్న తొలి వరల్డ్ కప్లోనే అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రవీంద్ర రికార్డుల్లోకెక్కాడు. ఈ వరల్డ్ కప్లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ రచిన్ రవీంద్ర ఇప్పటివరకు 3 శతకాలు నమోదు చేశాడు.
New Zealand Pacer Matt Henry ruled out of ICC ODI World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో హ్యాట్రిక్ ఓటములతో డేంజర్ జోన్లోకి వెళ్లిన న్యూజీలాండ్కు భారీ షాక్ తగిలింది. కివీస్ స్టార్ బౌలర్ మ్యాట్ హెన్రీ జట్టుకు దూరం అయ్యాడు. హార్మ్ స్ట్రింగ్ ఇంజ్యురీ కారణంగా ప్రపంచకప్ 2023 నుంచి వైదొలిగాడు. మ్యాట్ గాయం తీవ్రత ఎక్కువగా ఉండడం, ఇప్పట్లో అతడు కోలుకునే అవకాశం లేకపోవడంతో టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు.…
How New Zealand Can Qualify ODI World Cup 2023 Semi Finals: వన్డే ప్రపంచకప్ 2023 ఆరంభంలో వరుస విజయాలు సాధించిన న్యూజీలాండ్.. ఆపై హ్యాట్రిక్ ఓటములతో డేంజర్ జోన్లోకి వెళ్లింది. ఇంగ్లండ్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్లను ఓడించిన కివీస్.. భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలపై చేతులెత్తేసింది. పూణే వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్లో ప్రొటీస్ చేతిలో 190 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. హ్యాట్రిక్ పరాజయాలతో సెమీస్ అవకాశాలను న్యూజీలాండ్ సంక్లిష్టం చేసుకుంది. ప్రొటీస్ చేతిలో…
పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ ఘోర ఓటమిని చవిచూసింది. కివీస్పై సౌతాఫ్రికా జట్టు 190 పరుగుల తేడా భారీ విజయం సాధించింది.
ప్రపంచకప్ 2023లో భాగంగా పుణెలోని ఎంసీఏ స్టేడియంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య 32వ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు భారీ స్కోరు చేసింది.