న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆడుతున్న తొలి వరల్డ్ కప్లోనే అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రవీంద్ర రికార్డుల్లోకెక్కాడు. ఈ వరల్డ్ కప్లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ రచిన్ రవీంద్ర ఇప్పటివరకు 3 శతకాలు నమోదు చేశాడు.
New Zealand Pacer Matt Henry ruled out of ICC ODI World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో హ్యాట్రిక్ ఓటములతో డేంజర్ జోన్‌లోకి వెళ్లిన న్యూజీలాండ్‌కు భారీ షాక్ తగిలింది. కివీస్ స్టార్ బౌలర్ మ్యాట్ హెన్రీ జట్టుకు దూరం అయ్యాడు. హార్మ్ స్ట్రింగ్ ఇంజ్యురీ కారణంగా ప్రపంచకప్ 2023 నుంచి వైదొలిగాడు. మ్యాట్ గాయం తీవ్రత ఎక్కువగా ఉండడం, ఇప్పట్లో అతడు కోలుకునే అవకాశం లేకపోవడంతో టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు.…
How New Zealand Can Qualify ODI World Cup 2023 Semi Finals: వన్డే ప్రపంచకప్ 2023 ఆరంభంలో వరుస విజయాలు సాధించిన న్యూజీలాండ్.. ఆపై హ్యాట్రిక్ ఓటములతో డేంజర్ జోన్‌లోకి వెళ్లింది. ఇంగ్లండ్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌లను ఓడించిన కివీస్.. భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలపై చేతులెత్తేసింది. పూణే వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ప్రొటీస్ చేతిలో 190 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. హ్యాట్రిక్ పరాజయాలతో సెమీస్ అవకాశాలను న్యూజీలాండ్ సంక్లిష్టం చేసుకుంది. ప్రొటీస్ చేతిలో…
పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఘోర ఓటమిని చవిచూసింది. కివీస్‌పై సౌతాఫ్రికా జట్టు 190 పరుగుల తేడా భారీ విజయం సాధించింది.
ప్రపంచకప్ 2023లో భాగంగా పుణెలోని ఎంసీఏ స్టేడియంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య 32వ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు భారీ స్కోరు చేసింది.
వరుస ఓటములతో కొంత నిరాశతో ఉన్న న్యూజిలాండ్ టీమ్ కు ఇదొక శుభవార్త అని చెప్పవచ్చు. నవంబర్ 1న సౌతాఫ్రికాతో జరుగనున్న కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు, రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టులోకి తిరిగి రానున్నట్లు సమాచారం.
Ind vs Eng: ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ 2023లో భారత జట్టు తన ఆరో మ్యాచ్‌ని ఇంగ్లండ్‌తో ఆడనుంది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో ఆదివారం భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది.
ఉత్కంఠభరిత పోరులో న్యూజిలాండ్ పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. 5 పరుగుల తేడాతో ఆసీస్ గెలుపొందింది. చివర్లో జిమ్మీ నీషమ్ (58) దూకుడుగా ఆడినప్పటికీ చివరి ఓవరల్ రనౌట్ రూపంలో వెనుతిరిగాడు. నిర్ణీత 50 ఓవర్లలో న్యూజిలాండ్ 383/9 పరుగులు చేసింది.
ప్రపంచకప్ 2023లో భాగంగా ధర్మశాల వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపొందింది. భారత్ 48 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ అద్భుత బ్యాటింగ్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇదిలా ఉంటే చివరకు ఆడి 95 పరుగులు చేసి ఔటవ్వడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఇంకో…
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మరోసారి అత్యధిక వ్యూయర్ షిప్ నమోదైంది. మొన్న పాకిస్తాన్- ఇండియా మ్యాచ్ లో అత్యధికంగా 3.5 కోట్ల మంది వీక్షించగా, తాజాగా జరిగే న్యూజిలాండ్ మ్యాచ్ లో 4 కోట్లు వ్యూయర్ షిప్ దాటింది.