న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆడుతున్న తొలి వరల్డ్ కప్లోనే అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రవీంద్ర రికార్డుల్లోకెక్కాడు. ఈ వరల్డ్ కప్లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ రచిన్ రవీంద్ర ఇప్పటివరకు 3 శతకాలు నమోదు చేశాడు. గతంలో గ్లెన్ టర్నర్ 1975 వరల్డ్‌కప్‌లో రెండు, మార్టిన్ గప్టిల్ 2015లో రెండు, 2019లో కేన్ విలిమయ్సన్ రెండు శతకాలు సాధించారు.
Read Also: NZ vs PAK: వరల్డ్ కప్లో మరో భారీ స్కోరు.. పాక్పై కివీస్ వీరబాదుడు
ఇదిలా ఉంటే.. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ రికార్డును కూడా బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. పాతికేళ్ల వయసులోపే వరల్డ్‌కప్ టోర్నీలో అత్యధిక సెంచరీలు బాదిన తొలి బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. రచిన్ 23 ఏళ్ల 351 రోజుల వయసులో 3 శతకాలు సాధించగా.. సచిన్ టెండుల్కర్ 22 ఏళ్ల 313 రోజుల వయసులో ప్రపంచకప్‌లో రెండు సెంచరీలు చేశాడు.
Read Also: Minister Peddireddy: దేశంలో ఎక్కడా లేని విధంగా 99 శాతం ఎన్నికల హామీలు నెరవేర్చాం..
కాగా ప్రస్తుత ప్రపంచకప్ ఎడిషన్‌లో రచిన్ రవీంద్ర తొలుత ఇంగ్లండ్.. తర్వాత ఆస్ట్రేలియా.. తాజాగా పాకిస్తాన్‌పై సెంచరీలు నమోదు చేశాడు. ఈరోజు పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్లో 94 బంతుల్లో 114 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 15 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 108 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో రచిన్.. కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో సుదీర్ఘ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇదిలా ఉంటే.. ఈ వరల్డ్ కప్ లో ఆడిన 8 మ్యాచ్ ల్లో 74.71 సగటు మరియు 107.39 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 523 పరుగులు చేశాడు.