వరల్డ్ కప్లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 401 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముఖ్యంగా ఓపెనర్ రచిన్ రవీంద్ర (108)సెంచరీతో చెలరేగడం, కెప్టెన్ విలియమ్సన్ కూడా 95 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడటంతో న్యూజిలాండ్ స్కోరు పరుగులు పెట్టింది. అయితే భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు ఆశావహ దృక్పథంతో ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్ ఫఖార్ జమాన్ అద్భుత సెంచరీతో పాక్ దీటుగా బదులిస్తోంది. 402 పరుగుల లక్ష్యఛేదనలో ప్రస్తుతానికి పాక్ స్కోరు 21.3 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 160 పరుగులు చేసింది. అయితే బెంగళూరులో వర్షం పడుతుండటంతో మ్యాచ్ నిలిచిపోయింది.
Read Also: NZ vs PAK: పాక్ బౌలర్ల చెత్త రికార్డు.. చెలరేగిన కివీస్ బ్యాటర్లు
అంతకుముందు.. న్యూజిలాండ్ బ్యాటర్ల కన్న మీమేమీ తక్కువేం కాదన్న వైఖరితో ఫఖార్ జమాన్ కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పిడుగుల్లాంటి షాట్లతో కివీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. ఫఖార్ 69 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 106 పరుగులు చేసి క్రీజులో కొనసాగుతున్నాడు. అతనితో పాటు కెప్టెన్ బాబర్ అజామ్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. బాబర్ 51 బంతుల్లో 47 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
Read Also: World Cup: 2003-2019 వరల్డ్ కప్.. ఇండియా-సౌతాఫ్రికా మ్యాచ్ వివరాలు ఇవే..!
అయితే మంచి జోష్ మీదున్న పాకిస్తాన్ బ్యాటర్లకు వరుణుడు అడ్డు తగిలాడు. దీంతో మ్యాచ్ ఆగిపోయింది. అయితే ఒకవేళ ఇలానే వర్షం పడితే మ్యాచ్ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాకిస్తాన్ జట్టుకు కలిసొచ్చే అవకాశముంది. డీఎల్ఎస్ ప్రకారం చూసుకుంటే.. పాకిస్తాన్ 10 పరుగులు ఎక్కువ సాధించింది. ఈ క్రమంలో ఒకవేళ మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే, పాకిస్తాన్ ను విజేతగా ప్రకటిస్తారు.