హమాస్ అంతమే లక్ష్యంగా గత కొన్ని నెలలుగా గాజాపై ఇజ్రాయెల్ భీకరదాడులు చేస్తోంది. వందలాది మంది పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇక గాజాను స్వాధీనం చేసుకుంటామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: PM Modi: మాల్దీవులు చేరుకున్న మోడీ.. స్వయంగా స్వాగతం పలికిన ముయిజ్జు
కానీ అందుకు విరుద్ధంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కొత్త రాగం అందుకున్నారు. పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేయాల్సిందేనని తెలిపారు. సెప్టెంబర్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి సమావేశంలో ఈ విషయాన్ని అధికారికంగా లేవనెత్తుతున్నట్లు వెల్లడించారు. గాజాలో యుద్ధాన్ని ముగించి పౌర జనాభాను రక్షించడం నేటి అత్యవసర ప్రాధాన్యత అని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే సెప్టెంబర్‌లో పాలస్తీనా దేశాన్ని గుర్తించడానికి ఫ్రాన్స్ ముందుకు కదులుతుందని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గురువారం ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Rajasthan: రాజస్థాన్‌లో ఘోర విషాదం.. స్కూల్ బిల్డింగ్ కూలి నలుగరు మృతి
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రకటనను హమాస్, ముస్లిం దేశాలు స్వాగతించాయి. సరైన సమయంలో ఇది సానుకూల అడుగుగా అభివర్ణించింది. మాక్రాన్ చేసిన ప్రతిజ్ఞను హమాస్ ప్రశంసించింది. అయితే ఈ ప్రకటనపై ట్రంప్, నెతన్యాహు తీవ్రంగా మండిపడ్డారు. నిర్లక్ష్యం, సిగ్గుచేటు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి.
ఇది కూడా చదవండి: PM Modi: మోడీ సరికొత్త రికార్డ్! దేశ చరిత్రలో..!
మాక్రాన్ ప్రకటనను అమెరికా, ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించాయి. అక్టోబర్ 7 నాటి దాడి బాధితుల ముఖంపై చెంపదెబ్బలాంటిదని అమెరికా దేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అభివర్ణించారు. పాలస్తీనాను గుర్తించడమంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమేనని.. ఇది ఇజ్రాయెల్ అస్తిత్వానికే ముప్పు కలిగిస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు తెలిపారు.
ప్రస్తుతం గాజాలో ఆకలి కేకలు ఎక్కువైపోయాయి. చాలా నెలలుగా యుద్ధం జరగడంతో ఆహారం సరఫరా నిలిచిపోయింది. దీంతో గాజా ప్రజలు ఆకలితో తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. కొంత మంది ప్రాణాలు పోతున్నాయి. చిన్నారులు, వృద్ధులు ఆకలితో ప్రాణాలు వదులుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాక్రాన్.. పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేసి ప్రజల్ని రక్షించాల్సిందేనని పేర్కొ్న్నారు. ఈ వ్యవహారం ఎలా ముందుకు సాగుతుందో వేచి చూడాలి.