ఇజ్రాయెల్ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. గాజాను స్వాధీనం చేసుకోవాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీంతో గాజాపై మరింత పోరాటానికి ఇజ్రాయెల్ సిద్ధపడినట్లైంది. హమాస్‌ను అంతమొందించి గాజాను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకోనుంది. గాజాను స్వాధీనం చేసుకుని మిత్రదేశాలైన అరబ్ దేశాలకు అప్పగిస్తామని ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ప్రకటించారు. తాజా నిర్ణయంతో గాజాపై మరిన్ని దాడులకు ఇజ్రాయెల్ సిద్ధపడుతుంది.
ఇది కూడా చదవండి: Huma Qureshi: ఢిల్లీలో పార్కింగ్ వివాదం.. హీరోయిన్ హుమా ఖురేషి బంధువు హత్య
గాజా-ఇజ్రాయెల్ మధ్య దాదాపు 22 నెలలుగా యుద్ధం సాగుతోంది. 2023, అక్టోబర్ 7న హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి కొంత మందిని బందీలుగా తీసుకెళ్లిపోయారు. ఆ నాటి నుంచి ఇజ్రాయెల్.. హమాస్ అంతమే లక్ష్యంగా భీకర దాడులు చేస్తోంది. ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే మధ్యలో అంతర్జాతీయ మధ్యవర్తుల ద్వారా కొంత మంది బందీలను హమాస్ విడుదల చేసింది. ఇంకా కొంత మంది వారి దగ్గరే ఉన్నారు. అందరినీ ఒకేసారి విడిచిపెట్టాలని ఇజ్రాయెల్ కోరింది. అందుకు హమాస్ అంగీకరించలేదు. దీంతో ఇజ్రాయెల్ దాడులను కొనసాగించింది.
ఇది కూడా చదవండి: Heavy Rains: వదల బొమ్మాలి.. వదల.. తెలంగాణను వదలనంటున్న వరణుడు.. మరో రెండు రోజులు?
ఇక గాజాను స్వాధీనం చేసుకునే క్రమంలో యుద్ధ భూమికి వెలుపల ఉన్న ప్రజలకు మానవతా సాయం కూడా అందించనున్నట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. ఈ చర్య హమాస్ దగ్గర బందీలుగా ఉన్నవారిని వెనక్కి తీసుకొచ్చే ప్రణాళికలలో భాగమని వివరించింది. నెతన్యాహు విలేకరులతో మాట్లాడుతూ.. గాజాను స్వాధీనం చేసుకోవడం తమ ప్రణాళిక కాదన్నారు. హమాస్‌ను నాశనం చేసి.. బందీలను వెనక్కి తెచ్చుకొని.. ఆ ప్రాంతాన్ని తాత్కాలిక ప్రభుత్వానికి అప్పగించడమే తమ లక్ష్యమన్నారు.
ప్రస్తుతం గాజాలో దాదాపు 75 శాతం భూభాగం ఐడీఎఫ్ నియంత్రణలో ఉంది. తాజా ప్రణాళిక ప్రకారం.. మిగిలిన భూభాగాన్ని కూడా స్వాధీనం చేసుకోనుంది. అయితే దీన్ని ఐడీఎఫ్ వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చర్యతో బందీల ప్రాణాలు ప్రమాదంలో పడతాయనే ఆందోళనను వ్యక్తం చేసింది.