అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా ట్రంప్‌నకు శాంతి బహుమతి ఇవ్వాలని నెతన్యాహు మద్దతు కూడా ఇచ్చారు. అంతటి మంచి సంబంధాలు ఉన్న ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లుగా వార్తలు వినిపిస్తు్న్నాయి. ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణలో నెతన్యాహుపై ట్రంప్ అరిచినట్లుగా నివేదికలు అందుతున్నాయి.
ఇది కూడా చదవండి: TGSRTC: రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక బస్సులు.. చార్జీలలో మార్పులు!
గాజాలో ఈ మధ్య ఆకలి చావులు ఎక్కువైపోయాయి. చిన్నారులు, వృద్ధులు ప్రాణాలు విడుస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన సంభాషణలో ఆకలి చావులు జరుగుతున్నాయన్న వార్తలు నిజమైనవి కాదని.. అదంతా హమాస్ ప్రచారం మాత్రమేనని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు నెతన్యాహుపై ట్రంప్ అరిచినట్లుగా ఎన్‌బీసీ న్యూస్ నివేదించింది. అయితే ఈ వార్త అంతర్జాతీయంగా వ్యాప్తి చెందడంతో ఇజ్రాయెల్ పీఎంవో స్పందించింది. ఈ వార్త నకిలీదిగా పేర్కొంది. ఇద్దరి మధ్య అలాంటిదేమీ జరగలేదని కొట్టిపారేసింది.
ఇది కూడా చదవండి: Prostitution Racket: భారత్ చూపిస్తామంటూ బంగ్లాదేశీ మైనర్ అమ్మాయిని వ్యభిచారంలోకి నెట్టిన స్నేహితురాలు!
ఈ మధ్య గాజాలో ఆకలి చావులు అంటూ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు బయటకు వచ్చాక అంతర్జాతీయంగా ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెరిగింది. తక్షణమే కాల్పులు ఆపాలని.. గాజాలోకి ఆహారం వెళ్లేందుకు అనుమతించాలని డిమాండ్ పెరిగింది. దీంతో ఇజ్రాయెల్.. స్వచ్ఛంద సంస్థలకు అనుమతి ఇచ్చింది. అయినా కూడా దాడులు జరగడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఫొటోలు బయటకు వచ్చాకే.. ట్రంప్-నెతన్యాహు మధ్య సంభాషణ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ సంభాషణలోనే నెతన్యాహుపై ట్రంప్ అరిచినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇజ్రాయెల్ మాత్రం ఖండించింది.