గత ఆరు నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర హోమంత్రి అమిత్ షా చేసిన సహకారం మరువలేనిదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. 1.57 లక్షల ప్రజల ప్రాణాలను జాతీయ విపత్తు ప్రతి స్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్) ఇప్పటిదాకా కాపాడిందన్నారు. వసుధైక కుటుంబకం అని ప్రధాని మోడీ చెప్పినట్టుగా 19,365 మూగజీవాలని కాపాడిందని ప్రశంసించారు. ఎల్జీ పాలిమర్స్ లాంటి ఘటనలు, విజయవాడ వరదల్లో ఎన్డీఆర్‌ఎఫ్ సేవలు గణనీయం పేర్కొన్నారు. ప్రకృతి విపత్తుల నుంచి సైతం భారత దేశాన్ని…
సునామీ తరువాత జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(NDRF) ఏర్పడిందని.. ప్రస్తుతం 68 ప్రాంతాల్లో ఎన్‌డీఆర్ఎఫ్ సేవలు అందిస్తోందని ఎన్‌డీఆర్ఎఫ్ డీజీ పీయూష్ ఆనంద్, ఐజీ నరేంద్ర సింగ్ తెలిపారు. 1995లో జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం, కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
స్సాం రాష్ట్రంలోని దిమా హసావ్ జిల్లాకు 3 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఓ బొగ్గు గనిలో సోమవారం నాడు తవ్వకాలు కొనసాగిస్తుండగా అకస్మాత్తుగా 100 అడుగుల మేర నీళ్లు ప్రవేశించాయి. దాంతో తొమ్మిది మంది కార్మికులు అందులో చిక్కుకొన్నారు. అయితే, వారిలో ముగ్గురు చనిపోయినట్లు అధికారులు ప్రాథమికంగా తెలిపారు.
Rajasthan: ఆడుకుంటూ వెళ్లిన ఐదేళ్ల బాలుడు ఆర్యన్ ప్రమాదవశాత్తు పొలంలోని 150 అడుగుల లోతులో గల బోరు బావిలో పడిపోయి.. ప్రాణాలు కోల్పోయాడు. ఇక, బాలుడి కోసం రెస్క్యూ టీం సుమారు 57 గంటల కష్టపడింది.
Central Government: భారతదేశ వ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం రూ.5,858.60 కోట్ల నిధులను రిలీజ్ చేసింది. కేంద్ర ప్రభుత్వ వాటాలో భాగంగా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి 14 రాష్ట్రాలకు ఈ మేరకు కేంద్ర హోంశాఖ నిధులు విడుదల చేసింది.
Rescue Operation: రాజస్థాన్ రాష్ట్రములోని బుధవారం సాయంత్రం దౌసా జిల్లాలోని బండికుయ్ ప్రాంతంలో రెండున్నరేళ్ల బాలిక ఆడుకుంటూ ఓపెన్ బోర్‌వెల్ లో పడిపోయింది. ఇక అది గుర్తించిన ఇంటి సభ్యులు విషయాన్ని వెంటనే అధికారులకు తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే దౌసా జిల్లా యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. దౌసా జిల్లా కలెక్టర్ దేవేంద్ర కుమార్, దౌసా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) రంజితా శర్మ, నీటి సరఫరా విభాగం అధికారులు, స్థానిక యంత్రాంగం అందరూ సంఘటనా…
Vijayawada Floods: విజయవాడలోని కృష్ణా నదికి భారీగా వరద నీరు వస్తుంది. దీంతో విజయవాడలోని రైల్వే బ్యారేజ్ కి మూడు అడుగుల దూరంలో ప్రమాదకర స్థాయిలో వరద నీరు ప్రవహిస్తుంది. వరద ప్రవాహం పెరిగితే రైల్వే ట్రాక్ పైకి నీళ్లు వచ్చే అవకాశం ఉంది.
Vijayawada: వరద ముంపు నుంచి ఇంకా విజయవాడ నగరం తేరుకోలేదు. నగర శివారు ప్రాంతాలను కూడా బుడమేరు వాగు ప్రవాహం వదలి పెట్టలేదు. నున్న , గన్నవరం, సింగ్ నగర్ వెళ్ళే మార్గాలకు కనెక్టివిటీ కట్ అయింది. శివారు ప్రాంతాల్లో ఉన్న వందల ఎకరాలు ఖాలీ స్థలాలు, అపార్ట్ మెంట్లు ఇంకా నీటిలోనే మునిగిపోయాయి.
ఉత్తరప్రదేశ్‌లోని లక్నో విమానాశ్రయంలో రేడియోధార్మిక పదార్థం లీకైనట్లు సమాచారం రావడంతో తీవ్ర కలకలం రేపింది. కార్గో ప్రాంతంలో లీక్ కావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు
Building Collapses: మహారాష్ట్ర రాజధాని నవీ ముంబైలోని షాబాజ్ గ్రామంలో ఇవాళ (శనివారం) మూడు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు పోలీసులు, అగ్నిమాపక దళం, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.