Central Government: భారతదేశ వ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం రూ.5,858.60 కోట్ల నిధులను రిలీజ్ చేసింది. కేంద్ర ప్రభుత్వ వాటాలో భాగంగా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి 14 రాష్ట్రాలకు ఈ మేరకు కేంద్ర హోంశాఖ నిధులు విడుదల చేసింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం, మిజోరాం, కేరళ, త్రిపుర, నాగాలాండ్, గుజరాత్, మణిపూర్ రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సెంట్రల్ టీమ్స్.. వరద నష్టాన్ని అంచనా వేస్తూ ఇచ్చిన నివేదిక మేరకు తక్షణ సాయం కింద ఈ నిధులను కేటాయించింది.
Read Also: PM Modi: పాకిస్థాన్‌కు మద్దతుగా ఉండే పార్టీ కాంగ్రెస్..
ఇక, అత్యధికంగా మహారాష్ట్రకు 1,492 కోట్ల రూపాయల వరద సాయం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక, ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,036 కోట్లు, తెలంగాణకు రూ.416. కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే కేంద్ర బృందాల నుంచి పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని నిధులు మంజూరు చేయబోతున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది.
Ministry of Home Affairs releases ₹ 5858.60 crore to 14 flood-affected as a central share from the State Disaster Response Fund (SDRF) and an advance from the National Disaster Response Fund (NDRF)
Government stands shoulder to shoulder with the states affected by natural…
— PIB India (@PIB_India) October 1, 2024