Revanth Reddy : మొంథా తుఫాన్ ఎఫెక్ట్ తో వరంగల్ నగరం నీట మునిగింది. చాలా కాలనీలు నిండా మునిగిపోయాయి. వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అధికారులతో మాట్లాడిన సీఎం రేవంత్.. నేడు వరంగల్ కు వెళ్లనున్నారు. వరంగల్ లోని ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేయబోతున్నారు. పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లు, రెస్క్యూ, ఎస్డీఆర్ ఎఫ్, ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు తీసుకుంటున్న చర్యలపై కూడా ఆరా తీయనున్నారు. వరంగల్,…
CM Revath Reddy : తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల సూచన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్లతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ముందస్తుగా అలర్ట్ చేయాలని సీఎం ఆదేశించారు. “వచ్చే 72 గంటలు అలెర్ట్‌గా ఉండండి. ఎక్కడ ఏం జరిగినా వెంటనే కంట్రోల్ రూమ్ తో కమ్యూనికేషన్ కొనసాగించండి” అని సూచించారు. అకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్నందున, అవసరమైన హెలికాప్టర్లను…
Prakasam Barrage Flood Alert: ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి వరద నీరు ఉద్ధృతి కొనసాగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నదీపరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరదకు అనుగుణంగా అధికారులు నీటిని విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు.
Reactor Blast: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు సమీపంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం సీగాచి కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ పేలుడు ధాటికి పరిశ్రమ తునాతునకలైంది. ఇప్పటివరకు 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, 30 మందికి పైగా గాయాలపాలయ్యారు. వీరిలో 10 మందికి పైగా పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. Read Also:Kubera : పదేళ్లకే…
Operation Abhyas: అత్యవసర పరిస్థితుల్లో ప్రజల చొరవ, సహాయక సంస్థల సమన్వయం ఎంతో అవసరం. దీనికోసం ప్రభుత్వం తరచూ నిర్వహించే విధానాలే మాక్ డ్రిల్స్. అంటే,అనుకోని ప్రమాదాలు, ఉగ్రదాడులు, సహజ విపత్తులు వంటి సందర్భాల్లో ఎలా స్పందించాలి, ఎవరెవరు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాల్లో ముందస్తుగా ప్రాక్టీస్ చేసే కార్యక్రమాలు. ఇందులో ప్రభుత్వ విభాగాలు, సహాయక బృందాలు, ప్రజలు కలిసి పాల్గొంటారు. ఇక ప్రస్తుతం పాకిస్తాన్‌తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ…
Building Collapses: దేశ రాజధాని ఢిల్లీలోని ముస్తఫాబాద్ ప్రాంతంలో ఆరు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురు మరణించగా.. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
SLBC టన్నెల్‌లో మృతదేహాలు గుర్తించడానికి కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్ ను తీసుకొచ్చారు. రెండు ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ లలో 2 డాగ్స్ ను తీసుకొచ్చారు. రెస్క్యూ టీమ్ డాగ్స్ ను టన్నెల్ లోకి తీసుకెళ్లాయి. ఐఐటీ నిపుణుల బృందంతో సింగరేణి, NDRF బృందాలు టన్నెల్‌లోకి వెళ్లాయి... డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్.. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ సహాయక బృందాలకు దిశా నిర్దేశం చేస్తున్నారు.
SLBC Tragedy: శ్రీశైలం ఎడమ కాల్వ (SLBC) టన్నెల్‌లో చోటు చేసుకున్న విషాదకర ఘటన నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్‌లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ టన్నెల్‌లో ఇటీవల నీటి ప్రవాహం కారణంగా కొందరు 8 మంది కార్మికులు చిక్కుకొని చనిపోవడంతో.. ఈ ప్రమాదం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక ప్రమాదంలో చనిపోయిన వారి డెడ్ బాడీస్ ను తొలిగించిన తర్వాత.. ఫైర్ డీజీ (DG, FIRE) నాగిరెడ్డి స్వయంగా టన్నెల్‌లోకి వెళ్లి పరిస్థితులను సమీక్షించారు. టన్నెల్…