ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం జవాద్తుఫానుగా మారిన సంగతి తెలిసిందే. జవాద్ తుఫాన్ ప్రస్తుతం విశాఖకు ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. ఒడిశాలోని గోపాల్ పూర్ కు 530 కిలోమీటర్లు, పారాదీప్ కు 650 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.క్రమంగా ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి ఉత్తర కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే అవకాశముంది. అనంతరం తీరాన్ని ఆనుకుని కదులుతూ…
తిరుపతి నగరంలో భారీవర్షాల తర్వాత నిండుకుండలా మారిన రాయలచెరువు స్థానికుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. రాయల చెరువు సమీప గ్రామాల ప్రజలు ఇంకా భయం గుప్పెట్లోనే వున్నారు. అక్కడ క్షణక్షణం ఉత్కంఠ. రాయల చెరువు ప్రాంతంలో జారుతున్న మట్టితో జనం ఊపిరి బిగపట్టి మరీ జీవితం వెళ్ళదీస్తున్నారంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు కంటిమీద కునుకు లేకుండా వుంది జిల్లా యంత్రాంగం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికారులు సన్నద్ధం అయ్యారు. రాయలచెరువు కట్టపైనే ఎమ్మెల్యే…
యాస్ తుఫాన్.. తీవ్ర తుఫాన్‌గా మారుతుండడంతో అధికారులు అప్రమత్తం అవుతున్నారు.. తుఫాన్ ప్రభావం భారీగా ఉండే ప్రాంతాల్లో ముందుగానే అలర్ట్ అయ్యారు.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది ఎన్‌డీఆర్‌ఎఫ్.. ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్‌లోని 14 జిల్లాల పరిధిలో 8,09,830 మందిని లోతట్టు ప్రాంతాల నుంచి తరలించినట్లు అధికారులు చెబుతున్నారు.. యాస్ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండబోతోందన్న హెచ్చరికల నేపథ్యంలో.. ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.. ఇక, యాస్ తుఫాన్ ఎఫెక్ట్.. 11…