Viral News: ముద్దుగా ప్రేమగా పెంచుకునే కుక్క కనిపించకుండాపోయిందని ఓ మున్సిపల్ కమిషనర్ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతుంది. ఆదివారం సాయంత్రం నుండి కనపడకపోవడంతో.. పోలీసులు జల్లెడ పడుతున్నారు. విశ్రాతి లేకుండా 500 ఇళ్లలో సోదాలు జరిపారు. అయినప్పటికీ ఆ కుక్క ఆచూకీ దొరకలేదు. అయితే ఓ కుక్కను వెతికిపట్టుకునేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also: Mamata Benerjee: మమతా బెనర్జీకి తప్పిన ప్రమాదం.. ఉత్తర బెంగాల్‌లో హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
యూపీలోని మీరట్ మున్సిపల్ కమిషనరేట్లో మహిళ కమిషనర్గా పని చేస్తున్న సెల్వ కుమారి.. కొంత కాలంగా జర్మన్ షెపర్డ్ రకానికి చెందిన కుక్కను పెంచుకుంటున్నారు. దానికి ముద్దుగా ‘ఎకో’ అని పేరు పెట్టింది కూడా.. అయితే ఆ కుక్క ఉన్నట్టుండి ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో కనిపించకుండా పోయింది. దీంతో తన ఇంటివద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులకు కమిషనర్ విషయం చెప్పింది. దీంతో వారు ఆ కుక్క కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 36 గంటల్లో పోలీసులు ఇంటింటికీ వెళ్లి.. సుమారు 500 ఇళ్లలో విచారణ జరిపారు. అయినప్పటికీ ఆ కుక్క దొరకలేదు. మరోవైపు యానిమల్ వెల్ఫేర్ ఆఫీసర్ డాక్టర్ హర్పాల్ సింగ్ తన బృందంతో అర్ధరాత్రి 12 గంటలకు కమిషనర్ నివాసానికి చేరుకున్నారు. వారు కూడా ఆ కుక్క ఫోటో తీసుకొని వెతకడం ప్రారంభించారు.
Read Also: PCB Chairman Elections: పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు బలూచిస్తాన్ హైకోర్టు షాక్..
రాత్రంతా ఎక్కడపడితే అక్కడ వెతికినా కుక్క జాడ దొరకలేదు. అయితే కుక్క ఎప్పుడు, ఎలా అదృశ్యమైందో తెలియదని కమిషనర్ సెల్వ కుమారి తెలిపారు. కుక్క ఆచూకీ కోసం పోలీసులు సీసీ కెమెరాల ఆధారంతో వెతకడం ప్రారంభించారు. కాగా.. మునిసిపల్ రికార్డుల ప్రకారం, నగరంలో షెపర్డ్ జాతికి చెందిన 19 కుక్కలు మాత్రమే ఉన్నాయి. అయితే కుక్కను ఎవరో తమ ఇంట్లో ఉంచుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. కొన్ని స్థానిక మీడియా సంస్థలేమో కుక్క ఆచూకీ లభించిందని తెలిపాయి.