Vedanta-Foxconn: వేదాంత మరియు ఫాక్స్‌కాన్ మధ్య సంబంధాలలో చీలిక వచ్చిందని ఒక రోజు క్రితం ఊహాగానాలు వచ్చాయి. ఈ సంస్థల మధ్య సంబంధం ఎప్పుడైనా ముగిసిపోవచ్చన్నారు. అందుకు ఫాక్స్‌కాన్ కొత్త భాగస్వామి కోసం వెతకడం ప్రారంభించింది అని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు బయటకు వచ్చిన వార్త ఈ ఊహాగానాలన్నింటికీ తెరపడింది. వేదాంత-ఫాక్స్‌కాన్ వెంచర్ 40-నానోమీటర్ నోట్ టెక్నాలజీ కింద ప్రభుత్వానికి కొత్త సెమీకండక్టర్ అప్లికేషన్‌ను దాఖలు చేసింది. దీనిబట్టి చూస్తే ఆ రెండు సంస్థలు కలిసి పనిచేస్తున్నారని అర్థం. వేదాంత ఒక మీడియా నివేదికలో దరఖాస్తు యొక్క పునఃసమర్పణను ధృవీకరించింది. కంపెనీ ప్రకారం సవరించిన మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తు సమర్పించబడింది. భారత్‌లో ప్రపంచ స్థాయి ఫ్యాబ్‌ను తయారు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
Read Also: Malaria: అమెరికాను భయపెడుతున్న మలేరియా.. 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా కేసులు..
గత సంవత్సరం ప్రారంభంలో వేదాంత 28 nm నోడ్ కోసం దరఖాస్తు చేసింది. అయితే ఇప్పుడు వేదాంత ఫాక్స్‌కాన్ సెమీకండక్టర్ జెవి 40 ఎన్ఎమ్ నోడ్‌లను కూడా కొనసాగించేందుకు ఆసక్తి చూపుతోంది. ఇది 40 nm కంటే ఎక్కువ పరిపక్వ నోడ్‌లను ప్రోత్సహించే ప్రభుత్వ వ్యూహానికి అనుగుణంగా ఉంది. వేదాంత ఫాక్స్‌కాన్ సెమీకండక్టర్ CEO డేవిడ్ రీడ్ ఇంతకుముందు బిజినెస్ టుడేతో మాట్లాడుతూ.. మా వద్ద 3 nm లేవని.. ఇది ఏ మానవ DNA పరిమాణానికి సమానం అని కొందరు అంటున్నారని తెలిపారు. తాను 1.5 nmలో ఒక కథనాన్ని చూశానని.. అది చక్కెర అణువు యొక్క పరిమాణానికి సమానమని అన్నారు. అంతేకాకుండా తాము 55 nm, 90 nm, 65 nm యొక్క చిప్‌లను తయారు చేస్తామని తెలిపారు.
మరోవైపు సెమీకండక్టర్ తయారీపై వేదాంత సీరియస్ గా ఉంది. సెమీకండక్టర్ తయారీ ప్రణాళికలపై తీవ్రంగా కృషి చేస్తోంది. అంతేకాకుండా ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి గుజరాత్‌లో భూమిని ఖరారు చేయడమే కాకుండా.. కంపెనీ ప్రపంచ ప్రతిభను తీసుకురావాలని చూస్తోంది. JV తన బృందంలో ఇప్పటికే కొంతమంది పరిశ్రమ నిపుణులను నియమించుకుంది. వేదాంత ఫాక్స్‌కాన్ సెమీకండక్టర్ జాయింట్ వెంచర్‌కు సంబంధించి CEOగా డేవిడ్ రీడ్‌ను నియమించింది.
Read Also: Pune: ప్రపోజల్‌ని తిరస్కరించిందని గర్ల్‌ఫ్రెండ్‌పై కొడవలితో దాడి..
ఫాక్స్‌కాన్ తన సెమీకండక్టర్ వ్యాపారం కోసం కొత్త భాగస్వామిని కనుగొనడానికి పెద్ద భారతీయ వ్యాపార సంస్థలను కలుస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం జేవీలో వేదాంతకు 67 శాతం వాటా ఉంది.
అంతేకాకుండా సంబంధిత మంత్రిత్వ శాఖ ఫాక్స్‌కాన్‌నే నాయకత్వం వహించాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ పుకార్లను వేదాంత కొట్టిపారేసింది. జూన్ 1న భారతదేశం సెమీకండక్టర్ ప్లాంట్ల కోసం దరఖాస్తులు చేసింది. కొత్త దరఖాస్తుదారులను అంగీకరించడం, మూల్యాంకనం చేయడం ప్రారంభించింది. ఇప్పటికే ఉన్న దరఖాస్తుదారులను కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని.. అలాగే మెచ్యూర్డ్ నోడ్‌లను ఫార్వార్డ్ చేయాలని ప్రభుత్వం కోరింది.