Rape: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ముండ్కా ప్రాంతానికి చెందిన మైనర్ బాలికపై అత్యాచారం కేసు వెలుగులోకి వచ్చింది. ఆ బాలిక వయస్సు 16 సంవత్సరాలు. అత్యాచారం. అయితే ఈ ఘటనపై పోలీసులు బ్లాక్‌మెయిలింగ్ కింద కేసు నమోదు చేశారు. అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడి పేరు సల్మాన్. అతని వయస్సు 22 సంవత్సరాలు. ఈ అత్యాచార ఘటన జూన్ 29న చోటు చేసుకుంది. నిందితుడు తనను గురుగ్రామ్‌లోని తన సోదరుడి ఇంటికి తీసుకెళ్లాడని బాధితురాలు తెలిపింది. అంతేకాకుండా కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చినట్లు పేర్కొంది.
Health Tips: ఎండు డ్రాక్షతో ఎన్ని ప్రయోజనాలో.. ఆ సామార్థ్యాన్ని పెంచుతుంది..
అది తాగిన బాధితురాలు స్పృహతప్పి పడిపోయినట్లు తెలపగా.. స్పృహలోకి వచ్చేసరికి ఆమె శరీరంపై దుస్తులు లేవని చెప్పింది. నిందితుడు తనపై అత్యాచారానికి పాల్పడ్డినట్లు.. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని. చెబితే చంపేస్తామని బాధితురాలిని బెదిరించారు. ఆ తర్వాత కూడా మైనర్ బాలికపై నిందితులు 2-3 సార్లు అత్యాచారం చేశారు. కాగా ఆ విషయాన్ని బయటపెట్టకుండా ఉండేందుకు నిరంతరం బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉన్నాడని బాలిక తెలిపిది.
Adipurush: అప్పుడే ఓటిటీలోకి ఆదిపురుష్.. ?
ఆ నేపథ్యంలోనే బాధితురాలు జూలై 1న పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ ఔటర్ డిస్ట్రిక్ట్ హరేంద్ర కుమార్ సింగ్ తెలిపారు. బాధితురాలు శనివారం ముండ్కా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. CrPC సెక్షన్ 164 కింద మేజిస్ట్రేట్ ముందు ఈ స్టేట్‌మెంట్ రికార్డ్ చేయబడింది. పోలీసులు నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.