Himachal Rain: హిమాచల్ ప్రదేశ్‌లో తొలి రుతుపవన వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 6 మంది మృతి చెందినట్లు వార్తలు వస్తుండగా.. అన్ని చోట్లా పరిస్థితి దారుణంగా ఉంది. వర్షపు నీటి కారణంగా చాలా నదులు ఉప్పొంగుతున్నాయి. అంతేకాకుండా కొన్ని రహదారులపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు రహదారులపై జామ్ ఏర్పడింది. మండి నుంచి కులు వెళ్లే రహదారిపై కొండచరియలు భయంకరంగా విరిగిపడ్డాయి. అయితే ఆ ప్రమాదాన్ని నివారించేందుకు ప్రజలు రోడ్లపైకి రాకుండా ఉండాలని అధికారులు కోరుతున్నారు.
Read Also: Smart Watch : స్మార్ట్ వాచ్ ను వాడితే బరువు తగ్గుతారా?
ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లోని చాలా రహదారులపై జామ్ ఏర్పడింది. ఎందుకంటే పర్వత పగుళ్ల కారణంగా చాలా చోట్ల రోడ్లు మూసివేయబడ్డాయి. ఇందులో చండీగఢ్-మనాలి రహదారి కూడా ఉంది. అక్కడ కొన్ని కిలోమీటర్ల మేర వాహనాల జామ్ ఏర్పడింది. అయితే జామ్‌గా ఉన్న రోడ్లన్నింటినీ తెరవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ.. హిమాచల్ ప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వరద ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Read Also: Pawan Kalyan: ప్రభాస్ పై పవన్ సంచలన వ్యాఖ్యలు..
హిమాచల్‌లోని సిమ్లా, కులు, కాంగ్రా, చంబా, సిర్మౌర్, మండి జిల్లాల్లో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కులులోని మోహల్ ప్రాంతంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి చాలా వాహనాలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఉదయం జేసీబీ సాయంతో బయటకు తీశారు. వర్షం కారణంగా రాష్ట్రంలోని 100కు పైగా రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిందని అక్కడి జనాలు చెబుతున్నారు. అదే సమయంలో.. ఈ విపత్తులో సుమారు 10 మంది గాయపడ్డారు. అంతేకాకుండా రాష్ట్రంలో జంతువుల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉందని అక్కడి ప్రభుత్వం తెలుపుతుంది. ఇప్పటి వరకు 303 జంతువులు చనిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు.
#WATCH | Himachal Pradesh | Several vehicles washed away in heavy rainfall and damaged in Mohal, Kullu last night. The vehicles were retrieved with the help of a JCB vehicle. pic.twitter.com/pBMkehdML6
— ANI (@ANI) June 25, 2023
Read Also: Pawam Kalyan: నన్ను తిట్టినా, కొట్టినా భరిస్తాను.. రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగాలిచ్చారో చెప్పండి..
రాష్ట్రంలో విధ్వంసం కారణంగా ఇప్పటివరకు డజన్ల కొద్దీ రోడ్లు దెబ్బతిన్నాయి. దీని కారణంగా రాష్ట్రంలో DTR దెబ్బతిన్నాయి. అంతేకాకుండా 6 కంటే ఎక్కువ నీటి సరఫరా పథకాలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో పర్వతాలకు వెళ్లిన పర్యాటకులు పలుచోట్ల చిక్కుకుపోతున్నారు. సోమవారం ఉదయం వరకు రాష్ట్రంలో 64.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మరోవైపు IMD హిమాచల్ ప్రదేశ్ ఈరోజు 24 గంటల పాటు వరద ప్రమాద హెచ్చరిక జారీ చేసింది.
#WATCH | Himachal Pradesh | Flash flood witnessed in Bagi, Mandi following incessant heavy rainfall here. pic.twitter.com/EvWKyQefgG
— ANI (@ANI) June 25, 2023