Delhi Metro: ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే మెట్రో స్టేషన్లలో ఢిల్లీ మెట్రో ఒకటి. అక్కడ 287 మెట్రో స్టేషన్లలో ప్రతిరోజూ 17 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. ఢిల్లీ మెట్రో పసుపు, నీలం వంటి 10 లైన్లలో విస్తరించి ఉంది. దీని నెట్‌వర్క్ 348.12 కి.మీ ఉంటుంది. అయితే అటువంటి పరిస్థితిలో అన్ని స్టేషన్లను కవర్ చేయడానికి చాలా గంటలు పడుతుంది. ఏప్రిల్ 2021లో ఫ్రీలాన్స్ పరిశోధకుడు, ప్రయాణ ప్రియుడైన శశాంక్ మను ఢిల్లీ మెట్రోలో అలాంటి ఫీట్ చేసాడు. ఆ తర్వాత అతని పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది. అంతేకాకుండా ఆ వ్యక్తి ఇప్పటి వరకు 70 దేశాలు తిరిగినట్లు తెలుస్తోంది. అయితే తిరగడమంటే అతనికి ఎంత పిచ్చో..
Read Also: Lavanya Tripathi: మెగా కోడలు ఒక్కతే వెకేషన్ ఎంజాయ్ చేస్తుందే..
శశాంక్ మను ఈ ఏడాది ఏప్రిల్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికేట్ అందుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డును మెట్రో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ప్రఫుల్ సింగ్‌కు అందుకున్నాడు. ఆగస్ట్ 29, 2021న అతను ఢిల్లీ మెట్రోలోని అన్ని స్టేషన్లను కవర్ చేయడానికి 16 గంటల రెండు నిమిషాల సమయం తీసుకున్నాడు. కాగా.. మను 14 ఏప్రిల్ 2021న 15 గంటల 22 నిమిషాల 49 సెకన్లలో ఈ ఘనతను సాధించాడు. దీని తరువాత రికార్డును సరిదిద్దడానికి మను మరియు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ మధ్య కమ్యూనికేషన్ చాలా నెలలు జరిగింది. మను బ్లూ లైన్‌లో ఉదయం 5 గంటలకు రికార్డ్ ప్రయత్నాన్ని ప్రారంభించి.. గ్రీన్ లైన్‌లోని బ్రిగ్ హోషియార్ సింగ్ స్టేషన్‌లో రాత్రి 8.30 గంటలకు ముగించాడు.
Read Also: Ashada Bonalu: నరసరావుపేటలో అమ్మవారికి ఆషాడ బోనాలు సమర్పించిన ట్రాన్స్ జెండర్స్
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చేయాలనే ఆలోచన మనుకి ఎలా వచ్చిందంటే.. కరోనా మహమ్మారి సమయంలో ఈ రికార్డును సృష్టించాలనే ఆలోచన తన మనసులో ఉందని మను చెప్పాడు. ఫస్ట్ లాక్‌డౌన్ తర్వాత ఢిల్లీ మెట్రో తెరిచినప్పుడు ప్రయత్నించినట్లు తెలిపాడు. అతని లక్ష్యమేంటంటే.. ఢిల్లీ మెట్రో యొక్క అద్భుతమైన సేవ గురించి ప్రపంచానికి తెలియజేయడమని చెప్పాడు. ఢిల్లీ మెట్రో ప్రపంచంలోనే అత్యుత్తమ మెట్రో అని ఆయన అభిప్రాయపడ్డారు.
మరోవైపు ఆ రికార్డును సాధించాలని ఆ వ్యక్తి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. రికార్డు సృష్టించాలంటే ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కి ప్రయాణించాలని.. అలాగే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోని ఖచ్చితమైన మార్గదర్శకాలను పాటించాలని ఆయన చెప్పారు. ఆ సమయంలో అతను ప్రతి స్టేషన్‌లో ఫోటోగ్రాఫ్‌లు తీయవలసి ఉంటుంది. అంతేకాకుండా మను తన రికార్డును ప్రామాణీకరించడానికి ప్రతి మెట్రో స్టేషన్‌లో మెట్రో రైలు తలుపులు తెరవడం మరియు మూసివేసే సమయాల మధ్య ఒక అన్‌కట్ వీడియోను కూడా రికార్డ్ చేశాడు. రికార్డు కోసం ప్రయత్నించడం ఒకటని, దానిని వెరిఫై చేయడం మరొకటి అని ఆయన అన్నారు.