పశ్చిమ బెంగాల్‌లోని పరగణాస్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ రిటైర్డ్ ఆర్మీ జవాన్ తన భార్య, కుమార్తెను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. మృతులు డండం మున్సిపాలిటీలో నివసిస్తూ ఉంటారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం రిటైర్డ్ జవాన్ మధ్యంగ్రామ్ స్టేషన్ వద్ద రైలు కింద దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు తన కుమార్తె, భార్యను ఇంట్లో హత్య చేశాడు. ఈ ఘటనతో డమ్‌డమ్ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు.
Read Also: Kishan Reddy: రాష్ట్రంలో కుటుంబ పాలన పోవాలి..
భార్య, కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడిన రిటైర్డ్ ఆర్మీ జవాను పేరు గౌతమ్ బందోపాధ్యాయ. అతని భార్య దేవిక బెనర్జీ, కుమార్తె దిశా బెనర్జీ. జవాన్ ఆత్మహత్య అనంతరం అతని ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. జవాన్ ఇంట్లో భార్య దేవిక, కూతురు దిశ రక్తంతో తడిసిన మృతదేహాలను గుర్తించారు. వారిని కూరగాయల చాక్ తో హత్య చేసినట్లు పోలీసులు కనుగొన్నారు.
Read Also: Second Hand Car: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా?.. ఈ విషయాలు తెలుసుకోండి
మరోవైపు ఈ హత్య ఘటనపై పోలీసులు ఎంక్వైరీ చేపట్టగా.. జవాన్ మానసిక కుంగుబాటుకు గురైనట్లు పోలీసులు కనుగొన్నారు. అంతేకాకుండా.. అతని ఇంట్లో ఆ వ్యాధికి సంబంధించిన చాలా మందులను పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలోని జనాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రిటైర్డ్ జవాన్ భార్య దేవిక అందరితో మంచిగా కలిసుండేదని.. జవాన్ మాత్రం ఎప్పుడు ఎవరితోనూ మాట్లాడే వాడు కాదని స్థానికులు చెబుతున్నారు.