Fire Accident in train coach: తమిళనాడులోని మధురైలో శనివారం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. లక్నో నుంచి రామేశ్వరం వెళ్తున్న రైలు టూరిస్ట్ కోచ్‌లో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగగా 9 మంది మృతి చెందిన సంగతి విదితమే. ఈ ఘటనలో 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు కూడా. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు ప్రారంభించారు అధికారులు. అందులో భాగంగా తనిఖీలు నిర్వహించారు ఫోరెన్సిక్ నిపుణులు. ఈ దర్యాప్తులో భాగంగా వారికి కనిపించిన ఒక పెట్టెని చూసి షాక్ తిన్నారు అధికారులు. అందులో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. అయితే ఆ నోట్ల కట్టలు సగం కాలి ఉన్న స్థితిలో కనిపించాయి. రూ. 500, రూ. 200 నోట్లు ఈ కట్టల్లో ఉన్నట్టు గుర్తించారు.
Also Read: Anu Emmanuel: నేను ఆ బాధితురాలినే: అను ఇమ్మానుయేల్
ఈ డబ్బు ఎవరిది? అనే కోణంలో కూడా ఇప్పుడు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే రైలు ప్రమాదానికి సిలండర్ పేలడమే ప్రధాన కారణమని ప్రాధమిక దర్యాప్తులో తేలింది. అయితే ఇక్కడ మరో విషయాన్ని అధికారులు గుర్తించారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ ఘటనతో వారికి సంబంధం ఉందా అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. ఒకవేళ అదే కనుక జరిగితే ఈ కేసు వేరే మలుపు తిరిగే అవకాశం ఉంది. ఇక ఆ కోచ్ లో నోట్ల కట్టలు దొరకడం కూడా పలు అనుమానాలకు దారి తీస్తుంది. అయితే ఈ మొత్తాన్ని ట్రావెల్ ఏజెన్సీ వారు యాత్రికుల కోసం మధ్యలో ఖర్చు పెట్టడం కోసం తెచ్చుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. ఇక పారిపోయిన ఇద్దరు వ్యక్తుల కోసం ప్రత్యేక బలగాలు వెతుకుతున్నాయి. వారి అచూకీ తెలిస్తే రైలులో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఇక ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) టూరిస్ట్ రైలు లక్నో నుంచి రామేశ్వరం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఈ రైలులో 63 మంది యాత్రికులు ఉన్నట్లు సమాచారం. అయితే అందులో ఉన్న ఇద్దరు మహిళలు టీ పెట్టడానికి గ్యాస్ సిలండర్ వెలిగించగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.