ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా.. పాట్నా యూనివర్సిటీలో సన్మాన కార్యక్రమానికి నితీష్ కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తుండగా.. 'దేశ ప్రధాని ఎలా ఉండాలి, నితీష్ కుమార్ లా ఉండాలి' అంటూ కొందరు విద్యార్థులు నినాదాలు చేశారు.
2018లో నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు మహ్మద్ అక్బర్ లోన్ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో 'పాకిస్తాన్ జిందాబాద్' అనే నినాదాన్ని లేవనెత్తారు. ఈ పెద్ద వివాదం తర్వాత ఐదేళ్ల తర్వాత, సుప్రీంకోర్టు సోమవారం మహ్మద్ అక్బర్ లోన్‌ను భారత రాజ్యాంగానికి విధేయతగా ప్రమాణం చేసి, దేశ సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
జీ-20 శిఖరాగ్ర సమావేశానికి ఢిల్లీ మెట్రోపై అధికారులు ఆంక్షలు విధించారు అధికారులు. భద్రతా నిర్వహణ దృష్ట్యా కొన్ని స్టేషన్‌లను మూసివేస్తామని అధికారులు తెలిపారు.
కర్ణాటకలో ఓ టీచర్ క్లా్స్ రూంలో విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. గొడవ పడుతున్న ఇద్దరు ముస్లిం విద్యార్థులను ఉద్దేశించి పాకిస్థాన్‌కు వెళ్లండి.. ఇది హిందూ దేశం అని అన్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన 'రాజీవ్ యువ మితాన్ క్లబ్' కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. బీజేపీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ నడ్డివిరిచిందని అన్నారు. బీజేపీ, నరేంద్ర మోడీ భారతదేశంలోని ఇద్దరు, ముగ్గురు బిలియనీర్ల కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు.