Bridge collapse:గుజరాత్ రాష్ట్రంలో సురేంద్రనగర్ జిల్లాలో ఘోరం జరిగింది. వస్తాడి ప్రాంతంలో ఆదివారం పాత వంతెన కూలిపోయింది. దీంతో డంపర్, మోటార్ సైకిళ్లతో సహా పలు వాహనాలు వంతెన కింద ప్రవహిస్తున్న నదిలో పడిపోయాయి. వాహనాలతో పాటు ప్రయాణికులు నదిలో పడిపోయారు.
ఇవాళ (ఆదివారం) ఏపీ సీఐడీ అధికారులు రెండో రోజు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించనున్నారు. ఇవాళ చంద్రబాబును సూటిగా మరిన్ని ప్రశ్నలు సీఐడీ అధికారులు అడగనున్నట్లు తెలుస్తుంది.
కెనడా పార్లమెంట్‌లో ఆ దేశ ప్రధాని భారత్‌పై చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇరు దేశాల్లో రాజకీయ ఉద్రిక్తతలను సృష్టిస్తున్నట్లు కనిపిస్తోంది. కెనడా చర్యలకు భారత్ ధీటుగా సమాధానం ఇస్తోంది. కెనడాలో నివసిస్తున్న భారతీయులకు భారతదేశం ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది.
PM Modi WhatsApp Channel: ఛానల్స్ ఫీచర్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇప్పుడు వాట్సాప్‌కు వచ్చారు. ఈ ఫీచర్ గత వారం ప్రకటించారు. ఈ ఛానెల్‌లో పీఎం మోడీ ఇతర సామాజిక ప్లాట్‌ఫారమ్‌ల మాదిరిగానే తన సందేశాన్ని తన అనుచరులతో పంచుకుంటారు.
రాజస్థాన్‌లో జైపూర్ జిల్లాలోని చౌము పట్టణంలో 12వ తరగతి విద్యార్థి అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడని తల్లి మందలించడంతో ఆ విద్యార్థికి కోపం వచ్చింది. అతను తన స్టడీ సర్టిఫికేట్లను తన బ్యాగ్‌లో ఉంచుకున్నాడు. ఇంట్లో నుంచి రూ.రెండు వేల నగదు చోరీ చేసి తల్లి చూడకముందే ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు.
వినాయక చవితి వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో సందడి అంతా ఇంతా కాదు. గల్లీ గల్లీలో గణేశుడిని కొలిచి పూజిస్తారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అందుకు భిన్నంగా ఉంది. ఖైరతాబాద్ గణేశుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.