Boat capsized: బీహార్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. 30 మంది పిల్లలతో వెళ్తున్న పడవ ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటన గురువారం రోజున ముజఫర్ పూర్ లో జరిగింది. బాగ్‌మతి నదిలో పడవ ప్రయాణిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.
మణిపూర్ మళ్లీ అట్టుడుకుతోంది. కాంగ్‌పోక్పి జిల్లాలో మంగళవారం ఉదయం ముగ్గురు గిరిజనులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. గిరిజనులు అధికంగా ఉండే కంగ్గుయ్ ప్రాంతంలోని ఇరెంగ్, కరమ్ వైఫే గ్రామాల మధ్య ఈ దాడి జరిగిందని కాంగ్ పోక్పి అదనపు పోలీసు సూపరింటెండెంట్ తోలు రాకీ తెలిపారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మంగళవారం కులు, మండిలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రకృతి వైపరీత్యాల బాధితులను పరామర్శించి వారితో కలిసి బాధలను పంచుకున్నారు.