మంగళవారం ఢిల్లీ పోలీసులు చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) మరియు ఇతర సెక్షన్ల కింద "న్యూస్‌క్లిక్" వ్యవస్థాపకుడు మరియు ఎడిటర్-ఇన్-చీఫ్ ప్రబీర్ పుర్కాయస్తతో సహా ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
ఈ మధ్య కాలంలో భూకంపాలు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో భూప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో మంగళవారం భూకంపం సంభవించింది.
ఉత్తర భారతాన్ని భూకంపాలు వణికిస్తున్నాయి. నేపాల్‌లో 6.2 భూకంపం సంభవించిన కొన్ని గంటల తర్వాత ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భూప్రకంపనలు అక్కడి ప్రజలను భయాందోళనకు గురిచేశాయి.
Election Commission: తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటించనుంది. సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం మంగళవారం నుంచి మూడు రోజుల పాటు పర్యటించనుంది.
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీకి మరోసారి సమయం ఆసన్నమైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటి వరకు రెండు దశల్లో పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రభుత్వం పంపిణీ చేసింది.
Birthday Party: బర్త్ డే వేడులకు చాలా గ్రాండ్‌గా జరపాలని తల్లిదండ్రులు భావిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద తప్పులకు దారి తీస్తుంటాయి. క్యాండిల్స్, ఫోమ్ కారణంగా కొన్నిసార్లు అగ్ని ప్రమాదాలు సంభవించిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా బెంగళూర్ లో ఓ బర్త్ డే వేడుకల్లో తృటిలో ప్రాణాపాయం తప్పింది. బెలూన్లు పేలి నలుగురు చిన్నారులకు గాయాలయ్యాయి.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే వింత ఆరోపణలు చేశారు. ప్రజలు తనపై చేతబడి ప్రయోగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు. లఖింపూర్ ఖేరీ జిల్లా మెమహ్మదీ ఎమ్మెల్యే అయిన లోకేంద్ర ప్రతాప్ సింగ్ తన ఫేస్‌బుక్ పేజీలో ఈ ఫిర్యాదు చేశారు. తనను లక్ష్యంగా చేసుకుని చేతబడి చేస్తున్నారని, ఓ ఫోటోను పోస్ట్ చేశారు.
గతేడాది గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నది తాను కాదని గుజరాత్ ప్రజలేనని సమావేశాల్లో ప్రకటించారు. కాంగ్రెస్ తీవ్ర ప్రచారం తర్వాత, ప్రధాని మోడీ ప్రసంగం ఎన్నికల వాతావరణాన్ని మార్చింది. ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది. ఇప్పుడు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా అదే నినాదం ఇచ్చారు.
ISKCON: ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్(ఇస్కాన్) బీజేపీ ఎంపీ మేనకా గాంధీకి రూ. 100 కోట్ల పరువునష్టం నోటీసులు పంపింది. ఇటీవల ఆమె ఇస్కాన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమపై పూర్తి నిరాధార ఆరోపణలు చేయడంతో భక్తులు తీవ్రమైన బాధను వ్యక్తం చేశారని ఇస్కాన్ పేర్కొంది. ఇస్కాన్ కు వ్యతిరేకంగా జరుగుతున్న తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా తాము న్యాయం కోసం ఎలాంటి అవకాశాన్ని వదిలిపెట్టమని ఇస్కాన్ కోల్కతా వైస్ ప్రెసిడెంట్ రాధారామన్ దాస్ అన్నారు.