దేశంలోని పలు ఎయిర్‌పోర్టులను పేల్చేస్తామంటూ బెదిరింపు ఈమెయిల్ రావడంతో కలకలం రేగింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, అహ్మదాబాద్, లక్నో, చండీఘడ్, జైపూర్ ఎయిర్‌పోర్ట్‌లను పేల్చేస్తామని ఈమెయిల్ రావడంతో ఆయా రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. బాంబ్ స్క్వాడ్‌తో ఎయిర్‌పోర్టుల్లో తనిఖీలు చేపట్టారు. అధికారిక కస్టమర్ కేర్ ఐడీకి ఇమెయిల్ రావడంతో అన్ని విమానాశ్రయంలో కలకలం రేగింది. ఈ మేరకు సమాచారం అందుకున్న సీఐఎస్‌ఎఫ్ అధికారులు విచారణ చేపట్టారు. స్థానిక పోలీసుల సహాయంతో విమానాశ్రయంతో పాటు అక్కడ ల్యాండింగ్ చేసే…
వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో 23 సీట్లు కావాలన్న మిత్రపక్షం శివసేన (యూబీటీ) డిమాండ్‌ను కాంగ్రెస్ తిరస్కరించింది. లోక్‌సభ ఎన్నికల కోసం మహారాష్ట్ర వికాస్ అఘాడీ భాగస్వాములైన శివసేన (యూబీటీ), కాంగ్రెస్, ఎన్‌సీపీ మధ్య సీట్ల పంపకం గురించి చర్చించడానికి నాయకులు సమావేశమైన తర్వాత ఈ పరిణామం జరిగింది.
ఇకపై దేశంలోకి అక్రమ చోరబాట్లు లేకుండ భారత సరిహద్దు వద్ద తేనె టీగలు రక్షణగా ఉండబోతున్నాయి. ఈ మేరకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సన్నాహాలు చేస్తోంది. పైలట్ ప్రాజెక్ట్ కింద సరిహద్దుల్లో తేనె టీగలను కాపలాగా ఉంచబోతుంది. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే మాత్రం పెద్ద ఎత్తున తేనె టీగల పెంపకాన్ని బీఎస్ఎప్ చేపట్టనుంది. అయితే ముందుగా ఈ ప్రాజెక్ట్‌ను భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చేపట్టారు. ఎందుకంటే ఈ సరిహద్దుల్లోనే అక్రమ చోరబాట్లు ఎక్కువ. చెల్లుబాటు అయ్యే…
Rahul Gandhi : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) సస్పెన్షన్ తర్వాత కూడా ఈ అంశంపై రాజకీయాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈ ఉదయం హర్యానాలోని ఝజ్జర్‌లోని ఛరా గ్రామంలో ఉన్న వీరేంద్ర రెజ్లింగ్ అకాడమీకి చేరుకున్నారు.
ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం దగ్గర పేలుడు సంభవించింది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రోడ్‌లోని ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో 'పేలుడు' సంభవించినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీస్‌కు కాల్ వచ్చింది. మంగళవారం సాయంత్రం కాన్సులేట్ భవనం సమీపంలో పేలుడు జరిగినట్లు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ధృవీకరించింది.
ఆర్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌ల కార్యాలయాలపై దాడులు చేస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కి సోమవారం బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చిందని ముంబై పోలీసులు తెలిపారు.
భారత్‌కు వస్తున్న వాణిజ్య నౌకలపై ఇటీవల జరిగిన దాడులను కేంద్రం తీవ్రంగా పరిగణించినట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. న్యూ మంగళూరు ఓడరేవుకు వస్తుండగా అరేబియా సముద్రంలో వాణిజ్య నౌక ఎంవీ కెమ్ ప్లూటోపై దాడి చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రతిజ్ఞ చేశారు.
ప్రస్తుతం హిమల్‌చల్ ప్రదేశ్ పర్యాటకులతో కిటకిటలాడుతోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో దేశ నలుమూలల నుంచి పర్యాటకులు పోటేత్తున్నారు. భారీ సంఖ్యలు పర్యాటకులు రావడంతో మనాలి, అటల్ టన్నెల్ వద్ద ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. కిలోమీటర్ల మేర వాహనాలు వరుస కట్టిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పొగమంచు, వేల సంఖ్యలో పర్యాటకుల రాకతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అక్కడ సుమారుగా 5 గంటల పాటు వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు.…
కర్ణాటక మంత్రి శివనంద్ పాటిల్ రైతులపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పరిహారం కోసమే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ చేసిన ఆయన కామెంట్స్ ప్రస్తుతం తీవ్ర దూమారం రేపుతున్నాయి. రైతుల ఆత్మహత్యలను అవహేళన చేసిన మంత్రిపై ప్రజలు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దీంతో ఆయనను కేబినెట్ నుంచి తొలగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న శివానంద్ పాటిల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం చనిపోయిన రైతుల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని పెంచినప్పటి నుంచి రైతుల ఆత్మహత్యల…
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జనతాదళ్ (యునైటెడ్) చీఫ్‌గా రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్‌ను తొలగించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 29న ఢిల్లీలో జరిగే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.