ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసిన ఓ కస్టమర్‌కు చేదు అనుభవం ఎదురైంది. తనకు వచ్చిన ఫుడ్ పార్సల్ ఒపెన్ చేయగానే కంగుతిన్నాడు. తనకు వచ్చిన ఫుడ్‌లో ప్రాణంతో ఉన్న నత్త కదులుతూ దర్శనం ఇచ్చింది. దీంతో ఆ కస్టమర్ ఆగ్రహానికి గురయ్యాడు. ఆహారంలో దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతేకాదు సదరు రెస్టారెంట్‌ను ట్యాగ్ చేస్తూ ఇంకేప్పుడు ఈ రెస్టారెంట్‌లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవద్దంటూ నెటిజన్లకు సూచించాడు. Also Read: Parliament: రాజ్యసభ…
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన హస్తినకు చేరుకున్నారు. సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన ఢిల్లీ వెళ్లడం ఇదే తొలిసారి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో సీఎం భేటీ కానున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ, లోక్‌సభ ఎన్నికలపై చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. శాసనమండలిలో ప్రస్తుతం ఆరు స్థానాలు ఖాళీగా…
ప్రముఖ విమాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ చరిత్ర సృష్టించింది. ఒక్క ఏడాదిలో వంద మిలియన్ (పది కోట్ల మంది) ప్రయాణించిన తొలి భారత విమానయాన సంస్థగా రికార్డు సాధించింది. ఈ మేరకు ఇండిగో ఎక్స్‌లో అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ సందర్భంగా స్పెషల్ వీడియో షేర్ చేస్తూ.. ‘ఒక ఏడాది(2023) క్యాలెండర్ సంవత్సరంలో 100 మిలియన్ల మంది ప్రయాణికులను తీసుకువెళ్లిన తొలి భారతీయ విమానయాన సంస్థగా అరుదైన ఘనత సృష్టించింది’ అని పేర్కొంది. Also Read: Mumbai:…
కేరళలో దారుణం ఘటన వెలుగు చూసింది. వృద్ధురాలైన అత్తను దారుణంగా కొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వృద్ధురాలు అనే కనికరంగా కూడా లేకుండా ఆమె పట్ల కోడలు కర్కశంగా వ్యవహరించిన ఆమె తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక వీడియో పోలీసుల కంటపడటంతో సదరు కోడలును అరెస్టు చేసిన సంఘటన కేరళలోని కోల్లామ్ జిల్లాలో జరిగింది. ఈ వైరల్ వీడియోలో ఓ వృద్ధురాలు బయటి నుంచి మెల్లగా నడుచుకుంటూ వచ్చి హాల్లోని మంచంపై కూర్చుంది.…
కర్ణాటకలోని ఓ పాఠశాలలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులతో బలవంతంగా సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయించింది యాజమాన్యం. స్వయంగా స్కూల్ ప్రిన్సిపాల్ దగ్గరుండి మరీ విద్యార్థులతో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయించిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. కోలార్ జిల్లాలోని మొరార్జీ దేశాయ్ రెసిడెన్షియల్ స్కూల్లో ఇటీవల 7, 8, 9వ తరగతి చదువుతున్న విద్యార్థులతో పాఠశాలలోని సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేయించారు. ఐదారుగురు విద్యార్థులను బలవంతంగా లోపలికి దించి…
ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆపరేషన్ థియేటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ మహిళ, చిన్నారి మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. వివరాలు.. ఉత్తర ప్రదేశ్‌కి చెందిన ఓ మహిళ సర్జరీ నిమిత్తం పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ హాస్పిటల్లో చేరింది. మరో చిన్నారి కూడా హర్ట్ సర్జరీ కోసం ఇదే హాస్పిటల్లో చేరింది. వారిద్దరికి సోమవారం వైద్యులు…