Two Constables Arrest: బస్సు డ్రైవర్ నుంచి రూ. 14 లక్షలు లూటీ.. ఇద్దరు కానిస్టేబుల్స్ అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ ప్రైవేటు బస్సు డ్రైవర్ నుంచి రూ. 14 లక్షలు కాజేసిన ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్ అరెస్టు అయ్యారు. వారిపై చీటింగ్ కేసు కింది కేసు నమోదైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. కానిస్టేబుల్స్ కాచేసిన డబ్బు ఓ వ్యాపారికి చెందిన హవాల డబ్బుగా తెలుస్తోంది. ఈ మేరకు ఇండోర్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. వివరాలు.. డిసెంబర్ 23న స్థానికి వ్యాపారి అంకిత్ జైన్ అహ్మదాబాద్‌కు చెందిన కన్హయ్య లాల్‌కు రూ. 14 లక్షలు ఒక పెట్టలో పెట్టి ప్రైవేటు బస్సు డ్రైవర్ ద్వారా తరలించాడు. ఈ క్రమంలో చందన్ నగర్ పోలీసుల స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్ యోగేష్ చౌహాన్, దీపక్ యాదవ్‌లకు ఈ విషయం తెలిసింది.
Also Read: Viral Video: ప్రధానిపై ఇంత ద్వేషమా..! మోడీ పోస్టర్‌పైకి రాయి విసిరిన వ్యక్తి
Also Read
- Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
దీంతో దర్యాప్తు పేరుతో బస్సు తనిఖీ చేసిన సదరు కానిస్టేబుల్స్ క్యాష్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ డబ్బును సీజ్ చేసినట్టు పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇవ్వకుండా వారిద్దరే ఆ నగదును తీసుకున్నారు. దీంతో ఆ డబ్బు అందలేదని వ్యాపారి కన్హయ్య లాల్.. అంకిత్ జైన్‌కి తెలిపాడు. దీంతో అంకిత్ జైన్ బస్సు డ్రైవర్ నరేంద్ర తివారీపై చందన్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. ఆ డబ్బును యోగేష్ చౌహాన్, దీపక్ యాదవ్ స్వాధీనం చేసుకున్నట్టు డ్రైవర్ పోలీసులకు తెలిపాడు. దీంతో వారిద్దరు ఆ డబ్బు కాజేసినట్టు తేలింది.
Also Read: Plane Lands on Frozen River: రన్‌వే అనుకుని నదిపై విమానం ల్యాండింగ్.. ప్రయాణికులు సురక్షితం
దీంతో పోలీసు ఉన్నతాధికారులు వారిపై చర్యలకు ఆదేశించారు. ఇద్దరు కానిస్టేబుల్స్‌ను సస్పెండ్ చేసి వారిపై చీటింగ్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మరోవైపు, వ్యాపారవేత్త అంకిత్ జైన్, బస్సు డ్రైవర్‌తో పెద్ద మొత్తంలో డబ్బు తరలించడంపై కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హవాలా మార్గంలో డబ్బు తరలిస్తున్నట్లు అనుమానించిన పోలీసులు ఆ డబ్బును స్వాధీనం చేసుకుని ఆదాయపు పన్ను శాఖకు తెలియజేస్తామని అదనపు డీసీపీ వెల్లడించారు.
తాజావార్తలు
-
US Tariff Relief for India: ట్రంప్ సంచలన నిర్ణయం.. 100 శాతం సుంకాల అంశంలో భారత్‌కు బిగ్ రిలీఫ్..
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
IND vs ZIM: “ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. అయినా నాకు సంతృప్తిగా లేదు”.. కెప్టెన్‌గా తొలి విజయంపై స్మృతి కీలక వ్యాఖ్యలు..
-
AP High Court: స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..
-
Trump: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా నియామకం.. అంతలోనే షాకిచ్చిన ట్రంప్
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?