Rajnath Singh: భారత్‌కు వస్తున్న వాణిజ్య నౌకలపై ఇటీవల జరిగిన దాడులను కేంద్రం తీవ్రంగా పరిగణించినట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. న్యూ మంగళూరు ఓడరేవుకు వస్తుండగా అరేబియా సముద్రంలో వాణిజ్య నౌక ఎంవీ కెమ్ ప్లూటోపై దాడి చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రతిజ్ఞ చేశారు. వర్తక నౌకపై దాడి చేసిన వారిని సముద్రంలో ఎక్కడ దాక్కున్నా కనుగొంటామని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. సముద్రంలో భారత నౌకాదళం నిఘా పెంచిందని ఆయన స్పష్టం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. “సముద్రంలో జరిగిన దాడులను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. నిఘాను పెంచింది. సముద్రంలో ఎక్కడ దాక్కున్నా.. ఈ దాడికి పాల్పడిన వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని రక్షణ మంత్రి తెలిపారు. భారతదేశ అభివృద్ధిని చూసి కొన్ని దేశాలు విస్తుపోతున్నాయని మంత్రి తెలిపారు.
Read Also: Terrorists Using China-Made Weapons: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల వద్ద చైనా ఆయుధాలు!
సౌదీ అరేబియా నుంచి ముడి చమురును తీసుకువెళుతున్న ఎంవీ కెమ్ ప్లూటో అనే కార్గో నౌక న్యూ మంగళూరు ఓడరేవుకు వెళుతున్నప్పుడు అరేబియా సముద్రంలో భారతదేశ పశ్చిమ తీరంలో డ్రోన్ ద్వారా హౌతీ మిలిటెంట్లు చేసిన డ్రోన్ దాడిలో లక్ష్యంగా చేసుకుంది. జపాన్‌కు చెందిన, నెదర్లాండ్స్‌కు చెందిన లైబీరియన్ జెండా కింద ఉన్న కెమికల్ ట్యాంకర్‌ను డిసెంబర్ 23న భారత తీరానికి 200 నాటికల్ మైళ్ల దూరంలో డ్రోన్ ఢీకొట్టింది. సౌదీ అరేబియాలోని అల్ జుబైల్ నౌకాశ్రయం నుంచి న్యూ మంగుళూరు ఓడరేవుకు ఇది ముడి చమురును తీసుకువెళుతోంది. భారత నౌకాదళం ప్రకారం, 20 మంది భారతీయ, వియత్నామీస్ సిబ్బంది వాణిజ్య నౌకలో ఉన్నారు. ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదు. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ ఐసీజీఎస్ విక్రమ్ రక్షణలో కార్గో షిప్ సోమవారం ముంబై పోర్టుకు చేరుకుంది.