Himachal Pradesh: పర్యాటకులతో మనాలిలో భారీ ట్రాఫిక్.. నెటిజన్ల ఫన్నీ రియాక్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం హిమల్‌చల్ ప్రదేశ్ పర్యాటకులతో కిటకిటలాడుతోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో దేశ నలుమూలల నుంచి పర్యాటకులు పోటేత్తున్నారు. భారీ సంఖ్యలు పర్యాటకులు రావడంతో మనాలి, అటల్ టన్నెల్ వద్ద ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. కిలోమీటర్ల మేర వాహనాలు వరుస కట్టిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పొగమంచు, వేల సంఖ్యలో పర్యాటకుల రాకతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అక్కడ సుమారుగా 5 గంటల పాటు వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
కొందరు అసహనం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు సరదాగా స్పందిస్తున్నారు. అంతేకాదు ఆ సమయంలో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన వారు కూడా స్వయంగా తమ అనుభవాన్ని కామెంట్స్ రూపంలో తెలిపారు. ఓ వ్యక్తి ‘అటల్ టన్నెల్ వద్ద ఐదు గంటల నుంచి చిక్కుకుపోయి ఉన్నాను’ మరికొందరు ఈ జామ్ క్లియర్ అయ్యేలోగా.. హాలిడే అయిపోతుందేమో..! అంటూ ఫన్నీగా స్పందిస్తున్నారు. మరో యూజర్ ‘క్రిస్మస్ కంటే ముందు వచ్చాం కాబట్టి మాకు ఇంత ట్రాఫిక్ జామ్ ఎదురుకాలేదు.. ఇప్పుడు వచ్చే ప్లాన్ చేసుకోని రావాలి అని సూచిస్తున్నారు. ఇలా ట్రాఫిక్‌తో ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో కొందరు ఆకతాయిల చర్యలు నెటిజన్లను ఆగ్రహానికి గురిచేశాయి. రోడ్డుపై డోర్లు తెరిచి ఓ వ్యక్తి కారు నడుపుతుండగా.. మరికొందరు ఆ డోర్లకు వేలాడిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.
Also Read
- US Tariff Relief for India: ట్రంప్ సంచలన నిర్ణయం.. 100 శాతం సుంకాల అంశంలో భారత్‌కు బిగ్ రిలీఫ్..
- LK.Advani: ఎల్కే.అద్వానీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
- Abhijeet Dipke: నోటీసులు ఇచ్చినా వినలేదు.. అభిజీత్ దిప్కేపై ఢిల్లీ పోలీసుల కీలక ప్రకటన
- Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
Manali to Atal Tunnel pic.twitter.com/bYW6PGaaiB
— Weatherman Shubham (@shubhamtorres09) December 23, 2023
ఇలాంటి చర్యలతో కారు అదుపు తప్పే ప్రమాదం ఉందని, రోడ్లపై ఇలాంటి స్టంట్లు చేయొద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ ట్రాఫిక్ వీడియో ఏకంగా ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ స్పందిస్తూ టూరిస్ట్‌లను స్వాగతించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మొన్నటి వరకు వరదలతో అల్లాడిన హిమాచల్ ప్రదేశ్ పర్యాటకులతో కళకళలాడుతోందంటూ ఆనందం వ్యక్తం చేశారు. 10 వేల అడుగుల ఎత్తులో ఉన్న ప్రపంచంలోనే అత్యంత పొడవైన అటల్ టన్నెల్ నుంచి డిసెంబర్ 24న 12 వేల వాహనాల్లో 65వేల మంది ప్రయాణించారు. ప్రకృతి విపత్తు నుంచి కోలుకున్న హిమాచల్ ప్రదేశ్.. ఈ పండగ సీజన్‌లో పర్యాటకులను ఆహ్వానిస్తోంది’ అంటూ ఆయన రాసుకొచ్చారు.
Holidays are nowadays spent on roads. Jab tak jam khulega chutti khattam!!🤠 https://t.co/Opllq6odOF
— Alok Jain ⚡ (@WeekendInvestng) December 24, 2023
తాజావార్తలు
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
-
Retired GST Commissioner Kidnap Case: విశాఖలో రిటైర్డ్ జీఎస్టీ కమిషనర్ కిడ్నాప్ కలకలం..
-
US Tariff Relief for India: ట్రంప్ సంచలన నిర్ణయం.. 100 శాతం సుంకాల అంశంలో భారత్‌కు బిగ్ రిలీఫ్..
-
Pulivendula Chicken Centre Fire: పులివెందులలో చికెన్ సెంటర్‌కు నిప్పు.. ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!