Nara Lokesh: నీట్ పరీక్షలు వాయిదా వేయండి.. కేంద్రమంత్రికి లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవీయకు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. నీట్ పీజీ-2022 పరీక్షలు వాయిదా వేయాలని లేఖలో కోరారు. కోవిడ్ కారణంగా గతేడాది నీట్ పరీక్ష నిర్వహణ, కౌన్సెలింగ్ ఆలస్యం కావడం వల్ల తదుపరి సెషన్‌కు అభ్యర్థులు సిద్ధంగా లేరని లోకేష్ తన లేఖలో ప్రస్తావించారు. తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ విద్యార్థుల ఏడాది ఇంటర్న్ షిప్ పూర్తి కాకపోవడంతో వారు నీట్ పీజీ పరీక్షకు అర్హత సాధించే అవకాశం లేకుండా పోయిందన్నారు. దేశవ్యాప్తంగా నీట్ పీజీ పరీక్షకు 1.7 లక్షల మంది హాజరవుతుండగా.. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 20 వేల మంది విద్యార్థుల నుంచి వస్తున్న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని నారా లోకేష్ కోరారు.
నీట్ పరీక్ష కోసం ప్రిపేర్ అవ్వడానికి కూడా విద్యార్థులకు సమయం లేకుండా పరీక్షా తేదీలను ప్రకటించారని నారా లోకేష్ తన లేఖలో ఆరోపించారు. మే 21 నే పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించడం వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. కౌన్సిలింగ్‌కు హాజరుకావాలో లేక పరీక్ష కోసం ప్రిపేర్ అవ్వాలో తేల్చుకోలేక విద్యార్థులు అయోమయ స్థితిలో ఉన్నారన్నారు. కోవిడ్ రెండో దశ సందర్భంగా వేసిన డ్యూటీల కారణంగా చాలా మంది ఇంటర్న్ షిప్ పూర్తి చేయలేకపోయారని వివరించారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలకు సేవ చేసిన వారికీ పరీక్ష రాసే అవకాశం కల్పించాలని లోకేష్ కోరారు. విద్యార్థుల భవిష్యత్, అర్హులందరికీ అవకాశం కల్పించే విధంగా ఆలోచన చేసి వారి కోరిక మేరకు నీట్ పీజీ పరీక్షను వాయిదా వేయాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు.
Also Read
- Pawan Kalyan: కమిటీ పనితీరు సరిగా లేదు.. పిఠాపురంలో క్యాంప్ ఆఫీస్ పెడతా!
- Ambati Rambabu: మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు!
- Rain Alert: తీవ్ర వాయుగుండం ముప్పు.. మూడు రోజులు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్!
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
Chandra Babu: 30 ఏళ్లు అధికారంలో ఉండేలా టీడీపీ నేతలు పనిచేయాలి
తాజావార్తలు
-
India vs Japan: ఓడిపోతాం అనుకున్నా.. అతడే గట్టెక్కించాడు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
-
సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
-
Crude Prices: పెట్రో బాం*బ్! నిత్యావసర ధరలు పెరుగుతాయా?
-
Explainer: వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు చిన్నతనంలోనే.. షాకింగ్ స్టడీ!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!