నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా రోడ్డుప్రమాదంలో గాయపడ్డ ఓ లెక్చరర్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. జగన్‌కు ఇచ్చిన ఒక్క ఛాన్స్ తో జనం బతకడానికి ఛాన్స్ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ప్రజారోగ్య దేవుడిగా ప్రచారం చేసుకుంటున్న జగన్ వాస్తవానికి ప్రజల పాలిట యముడిలా తయారయ్యాడని నారా లోకేష్ విమర్శించారు.
Read Also:
Nellore: సర్కారీ ఆస్పత్రిలో ‘శంకర్‌దాదా’లు.. నిండు ప్రాణం బలి..!!
బైక్ యాక్సిడెంట్లో గాయపడిన లెక్చరర్ రామకృష్ణ నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరడమే శాపమా అని నారా లోకేష్ ప్రశ్నించారు. డ్యూటీ డాక్టర్ ఉండి కూడా స్వీపర్, సెక్యూరిటీ గార్డుతో చికిత్స చేసి ప్రాణంతో చెలగాటమాడటం దారుణమైన విషయమన్నారు. కక్ష సాధింపుల్లో జగన్ ప్రభుత్వం బిజీగా ఉంటే వ్యవస్థలన్నీ నిర్వీర్యమై జనం ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయని లోకేష్ ఆరోపించారు. లెక్చరర్ రామకృష్ణది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని మండిపడ్డారు. ఏపీలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోజురోజుకు పరిస్థితులు దిగజారుతున్నా వైసీపీ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదన్నారు.
జగన్ రెడ్డికి ఇచ్చిన ఒక్క ఛాన్స్ తో జనం బతకడానికి ఛాన్స్ లేకుండా పోయింది. బైక్ యాక్సిడెంట్లో గాయపడిన లెక్చరర్ రామకృష్ణ నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరడమే శాపమా? డ్యూటీ డాక్టర్ వుండి కూడా స్వీపర్, సెక్యూరిటీ గార్డుతో చికిత్స చేసి ప్రాణంతో చెలగాటమాడటం దారుణం.(1/3) pic.twitter.com/1fUJ17WZzE
— Lokesh Nara (@naralokesh) May 11, 2022