పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజ్ వివాదంలో మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేసిన వ్యవహారం ఏపీలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై మరొకరు తారాస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఈ క్రమంలోనే నారాయణ ఫోన్‌ను ట్యాప్ చేశామని మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించడం.. అగ్గికి ఆజ్యం పోసినట్టయ్యింది. దీంతో.. ఫోన్ ట్యాప్ చేయడం నేరపూరిత చర్య అని, అందుకు పాల్పడుతున్న వారిపై క్రిమినల్ కేసు రిజిష్టర్ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా నారా లోకేష్ కూడా ఈ విషయం మీద వైసీపీ ప్రభుత్వంపై తారాస్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీమంత్రి నారాయణ ఫోన్‌ను ట్యాప్ చేశామని మంత్రి పెద్దిరెడ్డి రికార్డెడ్‌గా చెప్పడం చూసి తాను షాక్‌కి గురయ్యానని అన్నారు. టీడీపీ నేతలపై కక్ష సాధించేందుకే వైసీపీ చట్టాలు, రాజ్యాంగాన్ని సైతం విస్మరిస్తోందన్న విషయం.. ఈ ఘటనతో నిరూపితమైందని మండిపడ్డారు. ఎవరి ఫోన్లనైనా ప్రభుత్వం ట్యాప్ చేసి, డెమొక్రసీ నాశనం అవుతోన్న ఫాసిస్ట్ రాష్ట్రంగా ఏపీ అవతరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలపై అసత్య ఆరోపణలు చేస్తూ, తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ ఓవర్ టైమ్ పని చేస్తుండటం సిగ్గుచేటని నారా లోకేష్ మండిపడ్డారు.
<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>Shocked to learn that Narayana Garu's phone was tapped, and that Peddireddy Ramachandra Reddy has the audacity to put this on record. This revelation has thoroughly exposed YSRCP's disgusting witch-hunt against TDP's leaders and its blatant disregard for laws & constitution.(1/2) <a href=”https://t.co/9ijUBLkQGf”>pic.twitter.com/9ijUBLkQGf</a></p>— Lokesh Nara (@naralokesh) <a href=”https://twitter.com/naralokesh/status/1524355944489963520?ref_src=twsrc%5Etfw”>May 11, 2022</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>