రాజకీయ, సామాజిక విశ్లేషకుడు సి.నరసింహారావు కన్నుమూశారు. అనారోగ్యంతో అర్థరాత్రి 1.50కి ఆయన తుదిశ్వాస విడిచారు. సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. వ్యక్తిత్వ వికాసంపై సి.నరసింహారావు అనేక పుస్తకాలు రాశారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సి. నరసింహారావు 1948, డిసెంబర్ 28న జన్మించారు. ప్రస్తుతం ఆయన వయసు 73 సంవత్సరాలు. క్రిష్ణా జిల్లా పెద్దపాలపర్రులో ఆయన జన్మించారు. విజయీభవ, విజయపథం, వ్యక్తిత్వ వికాసం, అన్యోన్య దాంపత్యం, పిల్లల్ని ప్రతిభావంతులుగా పెంచడం ఎలా?, బిడియం వద్దు, అద్భుత జ్ఞాపకశక్తి వంటి అనేక పుస్తకాలు రచించారు.
ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ సి. నరసింహారావు (C.Narasimharao) మృతి విచారకరమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) అన్నారు. వ్యక్తిత్వ వికాసంపై తాను రాసిన పుస్తకాల ద్వారా నరసింహారావు ఎంతో ప్రాచుర్యం పొందారని తెలిపారు. జర్నలిస్టుగా, వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా సమాజానికి ఆయన అందించిన సేవలు మరువ లేనివని అన్నారు. నరసింహారావు కుటుంబానికి చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ప్రముఖ సాహితీవేత్త, రాజకీయ, సామాజిక మానసిక విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు సి.నరసింహారావు (C.Narasimha rao) మృతి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. వారి కుటుంబ సభ్యులకు లోకేష్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Nara Lokesh: గన్ కంటే ముందొస్తానని ప్రచారం చేసుకున్న జగన్ ఎక్కడ?