సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్, నారా లోకేష్ పై హాట్ కామెంట్లు చేశారు మాజీ మంత్రి కొడాలి నాని.. ఈ ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీ నుండి గెంటేస్తారని అన్నారు కొడాలి నాని. పుట్టినరోజుకి, చావుకు తేడా తెలియని లోకేష్‌ను సీఎం చేయడం కోసం.. జూనియర్ ఎన్టీఆర్‌పై కుట్రలు చేసి, అనేక ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.
చంద్రబాబు ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని, పిల్లలకు ఇంగ్లీషు మీడియం ఇవ్వొద్దని కోర్టుకు వెళ్లారని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పల్లివూరులో గ్రామ సచివాలయ భవనాన్ని మంత్రి సీదిరి అప్పలరాజు ప్రారంభించారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ ఖాళీగా ఉండి ట్వీట్లు పెడుతున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. 70 రోజుల్లో ఎవరు మ్యాకప్పో.. ఎవరు ప్యాకప్పో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. పాదయాత్ర చేసి శ్రీకాకుళం రాకుండానే లోకేష్ ప్యాకప్ అయిపోయాడని బొత్స అన్నారు. ప్రజలు ఏదీ మరిచిపోరని, మరో డెబ్బై రోజుల్లో వారే సరైన సమాదానం చెబుతారని మంత్రి బొత్స పేర్కొన్నారు. పార్టీ కీలక సభ్యులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, ఉత్తరాంధ్ర ప్రాంతానికి తగరపువలసలో సీఎం…
రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం భూమిని త్యాగం చేసిన రైతులకు న్యాయం జరుగుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులకు ఎదురొడ్డి అమరావతి నిలబడిందన్నారు. అమరావతి కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన వారికి ఆయన నివాళులర్పించారు. అమరావతి పరిరక్షణకు రాజధాని రైతులు చేపట్టిన ఉద్యమం గురువారంతో 1500 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నారా లోకేశ్ తన ఎక్స్ ద్వారా స్పందించారు. ‘కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులకు ఎదురొడ్డి…
టీడీపీ, జనసేన పార్టీల మధ్య సీట్ల పొత్తు ఇంకా ఖరారు కాకపోవడంతో పార్టీ శ్రేణుల మధ్య విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటు విషయమై పోటీ పెరుగుతోంది. విజయవాడ పశ్చిమం టిక్కెట్ విషయంలో పెరుగుతున్న పోటీ. విజయవాడ పశ్చిమ టికెట్ కోసం అంతర్గతంగా టీడీపీ-జనసేన కూటమిలో పోటీ పెరుగుతోంది.
వెయ్యి మంది బాలయ్యలు, వెయ్యి మంది చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ వెంట్రుక కూడా పీకలేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని..
కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ నేతలు చంద్రబాబు నివాసంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. గన్నవరం టీడీపీ ఇంఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు లోకేష్‌ను కలిశారు. కేశినేని నాని పార్టీ వీడిన తర్వాత జరుగుతోన్న పరిణామాలపై చర్చించినట్లు తెలిసింది.