టీడీపీ నేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు విజయోత్సవ సభ నేడు జరగనుంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద భారీ బహిరంగ సభను టీడీపీ శ్రేణులు నిర్వహించనున్నారు.
నారా లోకేష్ పాదయాత్ర ఆపసోపాలు పడుతూ ముగిసిందని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. లోకేష్ పాదయాత్ర ఏ ప్రభావం లేని యాత్ర అని.. పాదయాత్ర తర్వాత కూడా లోకేష్‌లో ఏం మార్పులేదన్నారు. లోకేష్ యాత్ర వల్ల ఒళ్ళు తగ్గింది తప్ప బుర్ర పెరగలేదని అన్నారు. లోకేష్ సభకు కాస్ట్ లీ యాంకర్లు వస్తున్నారని.. మీసం తిప్పి హాస్యం చేయటంలో బాలయ్యను మించిన వారు లేరన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ కార్యదర్శి నారా లోకేష్‌లపై తీవ్రంగా మండిపడ్డారు మంత్రి చెల్లుబోయిన వేణు. లోకేష్ పాదయాత్ర లావు తగ్గడానికేననని ఆయన విమర్శించారు. లోకేష్‌ది క్యాట్ వాక్ అని, లోకేష్ పాదయాత్ర వద్దని ఆ పార్టీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడే చెప్పాడన్నారు. పాదయాత్రకే విలువలేదు, లోకేష్ రాసుకున్న ఎర్ర బుక్కు ఏం చేసుకుంటాడంటూ ఎద్దేవా చేశారు.
AP Deputy CM Narayana Swamy challenge Nara Lokesh Over Land: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సెటైర్లు వేశారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవని లోకేష్.. రెడ్ బుక్ రాస్తున్నాడంట అని ఎద్దేవా చేశారు. తాను 200 ఎకరాలు భూమిని కబ్జా చేశానని లోకేష్ అంటున్నాడని, ఎక్కడ ఉందో చెప్పి నిరూపించాలని సవాల్ విసిరారు. తనపై లేనిపోని విమర్శలు చేస్తే వంశమే ఉండదని…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.. కాకినాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. లేనిపోని ఆరోపణలు చేస్తే లోకేష్ నాలుక కట్ చేస్తాను అంటూ హెచ్చరించారు.
రాజకీయాలపై కనీస అవగాహన లేకుండా మాజీ ముఖ్యమంత్రి తనయుడుగా రాజకీయాల్లోకి ప్రవేశించి, రాజకీయాలను భ్రష్టు పట్టించే ప్రయత్నం లోకేష్ బాబు చేస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆరోపించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లపై సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఫైర్ అయ్యారు. నువ్వెంత.. నీ బతుకెంత లోకేష్ అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రిపై దూషణలా.. అచ్చోసిన ఆంబోతులా మాట్లాడితే బుద్ధి చెబుతామన్నారు.
రాజోలు నియోజకవర్గంలో రాజకీయం రాజుకుంటుంది.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తాటిపాక బహిరంగ సభలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. లోకేష్ ఆలోచించకుండా, తెలియకుండా మాట్లాడటం సరికాదని హితవుపలికారు.
ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన టీడీపీ - జనసేన జేఏసీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి ప్రతి 15 రోజులకోసారి జేఏసీ సమావేశాలు నిర్వహించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.