ఫ్యాక్షన్, ప్రతీకార రాజకీయాలకు అడ్డా అయిన కడప గడ్డపై రాజకీయాలను సమూలంగా మార్చి వేయాలని టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు కడప జిల్లాలో టీడీపీకి ఏనాడు ఆశించదగిన ఫలితాలు రాలేదు.. అయితే, ఈసారి ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న చంద్రబాబు తనయుడు నారా లోకేష్ గట్టి నమ్మకంతో ఉన్నారు. తండ్రిలాగే ముందు చూపుతో వ్యవహరించే లోకేష్ కడప జిల్లాలో పాతతరం నాయకులను గౌరవిస్తూనే.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని యువ నాయకత్వాన్ని తెర మీదకు తీసుకురావాలని లోకేష్ డిసైడ్ అయ్యారు. అందుకే, తన వ్యూహాన్ని లోకేష్ కమలాపురంలో అమలు చేస్తున్నారు. అక్కడ టీడీపీ ఇంచార్జి, సీనియర్ నేత పుత్తా నరసింహా రెడ్డికి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. అందుకే పుత్తా కుటుంబానికి ఊరూరా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈసారి కమలాపురం కోటపై టీడీపీ జెండా ఎగరడం ఖాయమని అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే ఇక్కడే నారా లోకేష్ ట్విస్ట్ ఇచ్చారు. టీడీపీ ఇంచార్జి పుత్తా నరసింహారెడ్డికి టికెట్ ఖాయమని అందరూ అనుకున్న తరుణంలో అతడి స్థానంలో ఆయన కుమారుడు పుత్తా చైతన్యరెడ్డికి అధికారికంగా టికెట్ కేటాయించారు.
Read Also: Viral Video: ఏం ఐడియా గురూ.. మండే ఎండల నుంచి ఇలా తప్పించుకోండి..
ఇక, కడప జిల్లాలో నిర్వహించిన యువగళం పాదయాత్ర సందర్భంగా కమలాపురం టీడీపీ ఇంచార్జ్ పుత్తా నరసింహారెడ్డి కుమారుడు పుత్తా చైతన్యరెడ్డి చూపించిన చురుకుదనం, నాయకులు, కార్యకర్తలను కలుపుకునిపోయే తత్వం, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలందించే గుణాన్ని నారా లోకేష్ కళ్లారా చూశారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమే అని భావిస్తున్న నారా లోకేష్ సీనియర్ నాయకులను గౌరవిస్తూనే, బలమైన యువనాయకత్వాన్ని తయారు చేయాలని రెడీ అయ్యారు. ఈ మేరకు చంద్రబాబును ఒప్పించి, కమలాపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పుత్తా చైతన్యరెడ్డికి టికెట్ కేటాయించారు. టికెట్ మారినా.. అది పుత్తా నరసింహారెడ్డి కుమారుడు పుత్తా చైతన్యకే కావడంతో ఆయన అభిమానులు, టీడీపీ క్యాడర్ సైతం అధిష్టానం నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేసింది.
Read Also: Lok Sabha Elections 2024: కసబ్ కేసు వాదించిన న్యాయవాదికి బీజేపీ ఎంపీ టికెట్..
అయితే, ఈసారి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వస్తే యువనేత పుత్తా చైతన్య రెడ్డికి మంచి స్థానం ఉంటుందని, మంత్రి పదవి దక్కినా ఆశ్చర్యం లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో ఒక్క కమలాపురం నియోజకవర్గం మాత్రమే కాకుండా.. కడప జిల్లా రాజకీయాల్లో పుత్తా చైతన్య రెడ్డి కీ రోల్ పోషించే ఛాన్స్ ఉందని తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతుంది. మొత్తంగా నారా లోకేష్ మెప్పు పొందిన టీడీపీ యువనేత పుత్తా చైతన్య రెడ్డి ఇప్పుడు ఉమ్మడి కడప జిల్లా రాజకీయాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారనే చెప్పాలి.