Nara Lokesh vs Murugudu Lavanya in Mangalagiri: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొన్ని గంటల్లో అసెంబ్లీ సహా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వైసీపీ రెండోసారి అధికారం చేపడుతుందా?.. లేదా కూటమి విజయం సాధిస్తుందా? అన్న ఆసక్తి అందరిలో ఉంది. అయితే అందరి దృష్టి మాత్రం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంపై ఉంది. గత ఎన్నికలో ఓడిన ఆయన విజయం సాధిస్తారా? లేదా రెండోసారి ఓడిపోతారా? అని జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: SA vs SL: విజృంభించిన నోకియా.. శ్రీలంక ఢమాల్!
2019 ఎన్నికల్లోనూ నారా లోకేశ్ మంగళగిరి నుంచి పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి 5337 ఓట్ల తేడాతో గెలిచారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గంజి చిరంజీవి పోటీ చేశారు. అప్పుడు వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి కేవలం 12 ఓట్లతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో లోకేశ్ ఓడిపోయినా.. మంగళగిరిని వీడలేదు. పట్టుదలతో పని చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ.. వారి సమస్యల్లో పాలు పంచుకున్నారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దాంతో ఈసారి ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. ఈసారి వైసీపీ నుంచి మురుగుడు లావణ్య పోటీ చేశారు. భారీ మెజార్టీతో గెలుపు ఖాయమని లోకేశ్ ధీమాతో ఉన్నారు. చూడాలి మరి మంగళగిరి ఎవరి సొంతం అవుతుందో.