నేడు వెలుబడిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి నారా లోకేష్ పలు వ్యాఖ్యలు చేసారు. ఇందులో భాగంగా ప్రజలు అద్భుతమైన విజయాన్ని అందించారని., ఈ విజయంతో మా బాధ్యత మరింత పెరిగిందని ఆయన పేర్కొన్నాడు. అలాగే వారిలాగా
తాము కక్షలు సాధించే ప్రభుత్వం మాది కాదని ఆయన తెలిపారు. అలాంటి ప్రభుత్వం నడిపే ఉద్దేశం మాకు లేదని చెప్పుకొచ్చారు. వాళ్లు చేసిన పొరపాట్లు తాము చేయుమని.. మాది ఒకే రాజధాని సిద్ధాంతమని లోకేశ్ పేర్కొన్నారు.
Anam Ramanarayana Reddy: టీడీపీ కూటమి ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఉన్నాయి..
రాష్ట్ర రాజధాని కేవలం అమరావతి అని, కాకపోతే.. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ కొనసాగుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ శ్రేణులు వేధించిన వాళ్లను, మా కుటుంబంపై దూషణలు చేసిన వాళ్ళను, చట్ట ప్రకారం శిక్షిస్తామని వార్నింగ్ ఇవ్వకనే ఆయన ఇచ్చారు. గత ప్రభుత్వనాకి తొత్తులుగా మారిన అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. ఇక నేడు ప్రకటించిన ఎన్నికల్లో టీడీపీ కూటమి 161 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది.
Chandrababu – Pawan: పవన్తో చంద్రబాబు భేటీ.. ప్రభుత్వ ఏర్పాటుపై మంతనాలు..!