Nara Brahmani – Ram Charan Photos Viral in Social Media: ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేశారు. ఆయన తర్వాత పవన్ కళ్యాణ్ సహా నారా లోకేష్ అలాగే ఇతర మంత్రివర్గ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ ప్రమాణస్వీకారం వేడుక గన్నవరం ఎయిర్ పోర్ట్ సమీపంలో ఉన్న కేసరపల్లి ఐటీ పార్క్ ప్రాంగణంలో భారీ ఏర్పాట్లతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు అదేవిధంగా నారా లోకేష్ కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు. మరోపక్క పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి, రామ్ చరణ్ తేజకు సైతం ఆహ్వానాలు అందాయి.
Pawan Kalyan: ప్రమాణ స్వీకారం.. చిరు కాళ్లపై పడి, చంద్రబాబుని హత్తుకున్న పవన్
ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నిన్ననే స్పెషల్ ఫ్లైట్లో బేగంపేట నుంచి గన్నవరం వెళ్లారు. మరోపక్క రాంచరణ్ గేమ్ చేంజర్ షూటింగ్ నుంచి ప్రమాణ స్వీకార ప్రాంగణానికి చేరుకున్నారు. అయితే ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతున్న సమయంలో రాంచరణ్ పక్కనే ఉన్న నారా బ్రాహ్మణి ఆయనతో మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నందమూరి బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణి నారా లోకేష్ ను వివాహం చేసుకున్నారు వీరికి దేవాన్ష్ అనే సంతానం ఉన్నారు. తన తండ్రి, భర్త, మామ అందరూ రాజకీయాల్లోనే ఉన్న బ్రాహ్మణి మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటారు. ప్రస్తుతం హెరిటేజ్ సంస్థకు సంబంధించిన అన్ని వ్యవహారాలు ఆమె చూసుకుంటున్నారు. ఎక్కువగా ఆమె బిజినెస్ మీదనే ఫోకస్ చేస్తున్నారు.