CM Revanth Reddy: నల్లగొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పలు ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట నుంచి చాపర్ ద్వారా నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంలకు చేరుకోనున్నారు.నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంలో ఉదయసముద్రం ఎత్తిపోతల పథకాన్ని మధ్యాహ్నం 2.40 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు.
Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
లక్ష ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టులో భాగంగా.. అప్రోచ్ కెనాల్, టన్నెల్, సర్జ్ పూల్, పంప్ హౌస్, మోటార్ల, రిజర్వాయర్ నిర్మాణాల ట్రయల్ రన్ అనంతరం రిజర్వాయర్‌లోకి నీటి ఎత్తిపోతకు సంబంధించిన పైలాన్‌ను రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం 3.15 గంటలకు మిర్యాలగూడ నియోజకవర్గంలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల యాదాద్రి థర్మల్ ప్లాంట్‌లో ప్రాజెక్ట్ యూనిట్ –2ను ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 4.30 గంటలకు నల్లగొండ మెడికల్ కాలేజీ భవన్నాన్ని సీఎం ప్రారంభించి, మెడికల్ కాలేజ్ ప్రాంగణంలోని బహిరంగసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు.
Read also: Canada: కెనడాలో భారతీయ విద్యార్థి దారుణ హత్య..
ముఖ్యమంత్రి రేవంత రెడ్డి పర్యటన నేపథ్యంలో చేపట్టిన ఏర్పాట్లను మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, పొన్నం ప్రభాకర్‌లు పరిశీలించి అధికారులతో సమీక్షించారు. దామరచర్ల మండలంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను ఉత్తమ్, తుమ్మల, పొన్నం సందర్శించారు. నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లెంలలో ముఖ్యమంత్రి ప్రారంభించనున్న పైలాన్, రిజర్వాయర్‌ను మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, పొన్నం పరిశీలించారు. నల్గొండలోని మెడికల్ కళాశాల, సభా ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పార్టీలకు అతీతంగా ప్రజలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.
SDT 18 : శరవేగంగా ఎస్ డీటీ18 షూటింగ్.. టైటిల్, గ్లింప్స్ కు ముహూర్తం ఫిక్స్