ఈ నెల 28న నల్గొండలో బీఆర్ఎస్ (BRS) రైతు మహా ధర్నా నిర్వహించనుంది. అయితే.. ఈ నెల 21న నల్గొండలో రైతు మహా ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునివ్వగా.. పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ధర్నాకు అనుమతి నిరాకరణ అంశంపై బీఆర్‌ఎస్ పార్టీ పెద్దలతో చర్చించారు. అనుమతి నిరాకరణపై బీఆర్‌ఎస్ నేతలు సోమవారం(20వ తేదీ)న హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ధర్మాసనం ఈరోజు.. ధర్నాకు షరతులతో కూడిన అనుమతినిచ్చింది.
Read Also: Made In India Car: ఈ మేడ్-ఇన్-ఇండియా కారు.. 100 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి..
ఈ నెల 28న రైతు మహా ధర్నా ఏర్పాట్లకు సంబంధించి బీఆర్ఎస్ నిమగ్నమైంది. నల్గొండ టౌన్‌లోని క్లాక్ టవర్‌లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మహా ధర్నా చేపట్టనున్నారు. నల్గొండ టౌన్‌లో జరిగే బీఆర్ఎస్ రైతు మహా ధర్నాకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. కాగా.. రైతు భరోసా రూ.15 వేలు ఇవ్వాలనే డిమాండ్‌తో బీఆర్ఎస్ మహా ధర్నా నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మభ్యపెడుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తూ మహా ధర్నా తలపెట్టింది.
Read Also: Bengaluru: మహిళపై టెక్నీషియన్ లైంగిక దాడికి యత్నం.. తర్వాత ఏమైదంటే..!