మహారాష్ట్రలోని ముంబైలో పెను ప్రమాదం జరిగింది. మలాద్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్ కూలడంతో ముగ్గురు కార్మికులు మరణించారు. మరో ముగ్గురికి గాయపడ్డారు. ఈస్ట్ మలాడ్లోని గోవింద్ నగర్ ప్రాంతంలో మధ్యాహ్నం 12:10 గంటలకు ఈ ఘటన జరిగింది.
మహారాష్ట్రలోని థానేలో ట్రాఫిక్ జామ్ వాహనదారులకు నరకం చూపించింది. గంట కాదు.. రెండు గంటలు కాదు.. ఏకంగా 5 గంటలకు పైగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రజలకు చుక్కలు కనిపించాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రధాని మోడీ శుక్రవారం మహారాష్ట్రలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఇదిలా ఉంటే త్వరలోనే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ముంబై నటి కాదంబరీ జిత్వానీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ సీరియస్ అయ్యింది.. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. జిత్వానీ నుంచి ఆన్లైన్లో ఫిర్యాదు తీసుకోవాలని.. ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది.
Sachin Tendulkar and Ramakant Achreka: సచిన్ టెండూల్కర్ చిన్ననాటి కోచ్ రమాకాంత్ అచ్రేకర్కు అంకితం చేసిన స్మారక చిహ్నం ప్రతిపాదనను మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆమోదించింది. మహారాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ముంబైలోని ప్రసిద్ధ శివాజీ పార్క్ లోని గేట్ నంబర్ 5 వద్ద స్మారక చిహ్నం నిర్మించడానికి ఆమోదించింది. దీని నిర్వహణ బాధ్యతను బివి కామత్ మెమోరియల్ క్రికెట్ క్లబ్కు అప్పగించారు. అయితే ఇందుకు ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక సహకారం అందించదు. శివాజీ పార్క్ జింఖానా…
Richest Ganesha: ముంబైలో గణేశ్ ఉత్సావాలకు సన్నాహాలు మొదలయ్యాయి. కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన బీమాను జీఎస్బీ పండల్ చేసినట్లు వార్తలు వచ్చాయి.
పూణే జిల్లాలోని పౌడ్ ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ హెలికాప్టర్లో నలుగురు వ్యక్తులు ఉన్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా ముగ్గురికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ప్రస్తుతం పూణేలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.