END of Ola and Uber?: హమ్మయ్య.. నగరాల్లో నరకం చూపే ఆటోవాళ్ల ఆగడాలను అరికట్టడానికి ఓలా, ఉబర్ వచ్చాయని జనం సంబరపడ్డారు. ప్రయాణం ఇంత సునాయాసమా అని సంతోషం వ్యక్తం చేశారు. ఇంటికే వచ్చి పికప్ చేసుకోవటం, సరిగ్గా ఎక్కడికి వెళ్లాలో అక్కడే డ్రాప్ చేయటం, ఛార్జీ బేరమాడే అవసరం లేకపోవటం, ఏసీ, ఎంటర్టైన్మెంట్ మరియు ఇతరత్రా సదుపాయాలు సైతం ఉండటంతో ప్యాసింజర్లు ఫుల్లు హ్యాపీగా ఫీలయ్యారు. కానీ.. ఆ ఆనందం మూణ్నాళ్ల ముచ్చటేనని ఆ తర్వాత తెలిసొచ్చింది.
ఈ రెండు ట్యాక్సీ రెంటల్ కంపెనీల తీరు ఈమధ్య ఇబ్బందికరంగా మారింది. పీక్ అవర్స్ అంటూ బిల్లులు ఎక్కువగా వస్తుండటం, బుకింగ్‌లు అకారణంగా క్యాన్సిల్ అవుతుండటం, పికప్‌లు లేటవుతుండటం, ఆటోవాళ్లయితే క్యాష్ ఇస్తేనే రైడ్ కంటిన్యూ చేస్తాం.. లేకపోతే లేదంటూ బెదిరిస్తుండటం.. ఇలా చెప్పుకుంటూపోతే చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌కి ప్రత్యామ్నాయమే లేదా అని ప్రజలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్న తరుణంలో కొత్త కంపెనీ తెర మీదికి వచ్చింది.
read more: Air india-Vistara: సింగపూర్ ఎయిర్‌లైన్స్ ప్రకటన
ఆ సంస్థ పేరే.. బ్లూస్మార్ట్. ఇది.. మన దేశంలోని మొట్టమొదటి ఎలక్ట్రిక్ ట్యాక్సీ కంపెనీ. వ్యాపార దిగ్గజాలు రతన్ టాటా, ముఖేష్ అంబానీ.. కంబైన్డ్‌గా ఈ స్టార్టప్‌ని ఏర్పాటుచేశారు. ఈ సంస్థకు చెందిన 600లకు పైగా వాహనాలు ప్రస్తుతం ఢిల్లీ మరియు జాతీయ రాజధాని ప్రాంతంలో సేవలందిస్తున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని నగరాల్లో సర్వీసులను ప్రారంభించనున్నాయి. ఓలా, ఉబర్‌తో పోల్చితే బ్లూస్మార్ట్ కనీసం 30 శాతం తక్కువ చార్జీకే అందుబాటులో ఉండటం స్థానికులను ఆకట్టుకుంటోంది.
పైగా.. కస్టమర్ సర్వీస్ విషయంలో ఓలా, ఉబర్ ఇప్పటికే ‘బ్యాడ్’ ఫీడ్‌బ్యాక్‌ని మూటగట్టుకున్నాయి. ఆ రెండు కంపెనీలపై నిత్యం ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆ కంప్లైంట్ల సంఖ్య ప్రస్తుతం ఆల్‌టైం హై లెవల్లో నమోదవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో.. పేరుకు తగ్గట్లే బ్లూస్మార్ట్.. తన వినియోగదారులకు స్మార్ట్‌గా సర్వీసులు అందిస్తుందని ఆశిస్తున్నారు. ఈ సంస్థకు 3 వేల 500 విద్యుత్ వాహనాలను ఇచ్చేందుకు టాటా మోటార్స్ గతేడాదే అంగీకారం తెలిపింది.
బ్లూస్మార్ట్ కంపెనీ.. జియో-బీపీతోనూ జట్టు కట్టింది. జియో-బీపీ అనేది రిలయెన్స్ ఇండస్ట్రీస్ మరియు బ్రిటిష్ పెట్రోలియంల జాయింట్ వెంచర్. ఈ సంస్థ మన దేశవ్యాప్తంగా స్మార్ట్ ఛార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు బ్రిటిష్ పెట్రోలియం.. బ్లూస్మార్ట్‌లో 13 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. తద్వారా ఆర్థికంగా ఓలా, ఉబర్‌లతో పోటీపడేందుకు దోహదపడింది. దీంతో బ్లూస్మార్ట్.. సరసమైన ధరలకే విశ్వసనీయమైన సేవలు అందించాలనే గట్టి పట్టుదలతో ఉంది. జీరో రైడ్ క్యాన్స్‌లేషన్లు, జీరో సర్జ్‌లు, జీరో ఎమిషన్ లక్ష్యాలతో ముందుకెళుతోంది. బ్లూస్మార్ట్.. ఆల్ ది బెస్ట్.