Mukesh Ambani: 2047 నాటికి 40 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Can Be USD 40 Trillion Economy By 2047 Says Mukesh Ambani: రిలయన్స్ వ్యాపారం మర్రిచెట్టులా విస్తరిస్తోందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ అన్నారు. రిలయన్స్ ఫ్యామిలీ డే ఫంక్షన్ లో ఆయన మాట్లాడారు. రానున్న రోజుల్లో భారత్ మరింతగా అభివృద్ధి చెందుతుందని..దాంట్లో రిలయన్స్ పాత్ర ఉంటుందని వెల్లడించారు. దశాబ్ధాలు గడిచిపోయాయి.. రిలయన్స్ మర్రిచెట్టులా దాని కొమ్మలు విశాలంగా విస్తరిస్తున్నాయని.. భారతీయుల జీవితాలను సుసంపన్నం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. 40 ఏళ్ల క్రితం ప్రారంభం అయిన రిలయన్స్ ఓ వటవృక్షంలా మారిందని, మా నాన్న స్థాపించిన మిషన్ గురించి ఆలోచించినప్పుడు గొప్పగా, ఎంతో పవిత్రమైనదిగా నమ్ముతానని అన్నారు.
Read Also: Telangana DGP: రాష్ట్రానికి కొత్త డీజీపీగా ఆ ఇద్దరిలో ఒకరు .. రేపు ఉత్తర్వులు..!
Also Read
- Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్..!
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
ప్రపంచస్థాయి వ్యాపారాలు నిర్మించడం ద్వారా భారతదేశాన్ని సుసంపన్నంగా చేయడమే రిలయన్స్ లక్ష్యం అని అని అన్నారు. ప్రపంచం మొత్తం 21 శతాబ్ధాన్ని ‘భారతదేశ’ శతాబ్ధంగా చూస్తోందని.. మన ప్రధాని నరేంద్రమోదీ ఈ కాలాన్ని ‘భారతదేశ అమృత కాలం’గా అభివర్ణిస్తున్నారని తెలిపారు. రాబోయే 25 ఏళ్లు భారతదేశ 5 వేల ఏళ్ల చరిత్రలో అత్యంత పరివర్తన చెందుతుందని.. 2047 నాటికి భారత్ 40 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యువత, పరిణితి చెందిన ప్రజాస్వామ్యం, సాంకేతిక శక్తి భారతదేశాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తాయని అన్నారు.
పేదరికం, కొరత నుంచి ప్రస్తుతం భారతదేశం 140 కోట్ల భారతీయులకు జీవిత నాణ్యత, సమ్మిళిత శ్రేయస్సు, సమృద్ధి అవకాశాలు, అభివృద్ధి యుగంలోకి ప్రవేశించిందని ముఖేష్ అంబానీ అన్నారు. భారతదేశం అంతటా 5జీ నెట్వర్క్ ను అందుబాటులోకి తీసుకువచ్చినందుకు ముఖేష్ అంబానీ, కుమారుడు ఆకాష్ ను ప్రశంసించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ 5జీ నెట్వర్క్ ను జియో అందిస్తుందని..2023 నాటకి డిజిటల్ కనెక్టవిటీ వ్యాపారంలో నెంబర్ 1గా నిలుస్తామని అన్నారు. నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం, అధిక ఉత్పాదకత, ఆర్థిక కార్యకలాపాకలు భారతీయులు ఎప్పటికి దూరం కాబోరని ముఖేష్ అంబానీ హామీ ఇచ్చారు. ప్రతీ గ్రామంలో 5జీ కనెక్టవిటీ ఉంటుందని.. దేశాన్ని చాలా కాలంగా పట్టి పీడిస్తున్న గ్రామీణ-పట్టణ తారతమ్యాలు పూర్తిగా రూపుమాపుతాం అని అన్నారు. న్యూ ఎనర్జీ అనేది రిలయన్స్ సరికొత్త సార్ట్ అప్ వ్యాపారమని.. ఇది కేవలం కంపెనీ, దేశానికే కాకుండా మొత్తం ప్రపంచాన్ని మార్చగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
-
Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్..!
-
YS Jagan: ‘నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను’.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
-
Devaraaya: శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ‘దేవరాయ’ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!
-
BRB First Look: కిచ్చా సుదీప్ బర్త్‌డేకు అదిరిపోయే ట్రీట్.. మంచు ప్రపంచంలో మాస్ అవతార్!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!