ఏపీలో వైసీపీ ఇంజిన్ ఒకటే.. అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి, సంకల్పం ఉంటే ఇంజిన్లతో పని లేదు.. ఇంజిన్ కన్నా శరవేగంగా దూసుకుపోగల సత్తా జగనన్నది అని మార్గాని భరత్ అన్నారు.
దక్షిణ కాశీగా పేర్గాంచిన రాజమండ్రి పవిత్ర గోదావరి పుష్కర్ ఘాట్ నుంచి అయోధ్య బాల రాముని దర్శనానికి బైక్స్ పై బయల్దేరుతున్న యువకులిద్దర్నీ ఎంపీ మార్గాని భరత్ అభినందించారు. వారి ప్రయాణం దిగ్విజయంగా కొనసాగాలని కోరారు..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా దానిని స్వాగతించాలని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ఆ పార్టీలోని అసంతృప్తి ఎమ్మెల్యేలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ హితవు పలికారు.