ఓయ్ ముద్దపప్పు.. నోరు లేస్తోంది.. సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు.. కాస్త నోరు అదుపులో పెట్టుకో' అంటూ వైసీపీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ శ్రేణులు దాడులను ఎంపీ మార్గాని భరత్ ఖండించారు. పోలీసులపై దాడి చేయించడం అమానుషం.. చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెబుతారు.. టీడీపీ శ్రేణుల దాడులు ప్రీ ప్లాన్డ్ స్కెచ్ గా కనిపిస్తుంది అని ఎంపీ భరత్ ఆరోపించారు.
ఒకరు ఉంటే భార్య అంటారు.. నలుగురు, ఐదుగురు ఉంటే పెళ్లాలే అంటూరు అంటూ సెటైర్లు వేశారు ఎంపీ మార్గాని భరత్.. నమస్కారానికి కూడా సంస్కారం లేని వ్యక్తి పవన్ కల్యాణ్ అని మండిపడ్డ ఆయన.. వాలంటీర్లు ఉద్యమిస్తే ఎలా ఉంటుందో పవన్ రుచి చూశాడన్నారు.