సంగారెడ్డి జిల్లా కేంద్రం లోని కలెక్టరేట్ కార్యాలయం ముందు టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణుల వరి కొనుగోలు నిరసన కారక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టూరిజం, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండించిన పంటకు గిట్టు బాటు ధర లేకుండా వుండే కానీ 2014లో తెలంగాణ రాష్టం వచ్చాక ఈ రాష్టానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కోటి ఎకరాలు మాగాణి చేయడానికి గోదావరీ జలాలను ముఖ్యమంత్రి తెచ్చారని,…
ఏప్రిల్ 2వ తేదీ రాత్రి రాడిసన్ బ్లూ హోటల్ లోని పబ్ లో జరిగిన రేవ్ పార్టీలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల పిల్లలు పాల్గొన్నారు. వారందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ.. ఈ పబ్ ను నిర్వహిస్తున్నవారు బీజేపీ, కాంగ్రెస్ నేతల సన్నిహితులేనని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పిల్లలు ఎంత పెద్ద వారు అయినా పోలీసులు వదిలి పెట్టకూడదన్నారు. గతంలో హైదరాబాద్ లో…
తెలంగాణ బీజేపీలో త్వరలో కొందరిపై వేటు పడబోతుందా? తూతూ మంత్రంగా పనిచేస్తున్న వారికి షాక్ తప్పదా? బండి సంజయ్ ఎవరిపై కన్నెర్ర చేశారు? ఆయన హెచ్చరికలు వర్కవుట్ అవుతున్నాయా.. లేదా? జిల్లా అధ్యక్షుల పనితీరుపై పెదవి విరుపుతెలంగాణలో ప్రత్యమ్నాయశక్తిగా పొలిటికల్ తెరపైకి రావాలని చూస్తోన్న బీజేపీ.. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. పోలింగ్ బూత్ నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీల పనితీరును సమీక్షిస్తోందట. అనుబంధ సంఘాలు.. పార్టీ కార్యక్రమాలు.. జిల్లాల్లో సొంతంగా చేపట్టిన పొలిటికల్ ప్రోగ్రామ్స్‌పై…
ఉక్రెయిన్ లో తెలుగు బిడ్డలు చిక్కుకుంటే కనీసం సమీక్ష నిర్వహించలేదు.. ఒక్క విద్యార్తి తో అయినా మాట్లాడారా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఇవ్వాళ వెళ్లి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్వాగతాలు పలుకుతున్నారు.. సిగ్గుండాలి వాళ్లకు అని తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ ను గజగజ వణికిస్తున్న పార్టీ బీజేపీ అని, నువ్వేం చేయలేవు.. నీతో ఏమి కాదు కేసీఆర్ అని ఆయన మండిపడ్డారు. మూర్ఖుడు, అతడి కుటుంబం తెలంగాణను ఏలుతోందని, శ్రీకాంత చారి, ఉద్యమకారుల…
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల్ని ప్రత్యేక విమానాల్లో తీసుకువస్తున్న ప్రధాని మోడీకి ధన్యవాదాలు అని బండి సంజయ్ కుమార్ అన్నారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థుల తల్లిదండ్రుల తరపున మోడీకి బండి సంజయ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం అక్కడ చదువుకుంటున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో తీవ్ర భయాందోళన కలిగించిందని, ఇక్కడ ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురిఅయ్యారని ఆయన అన్నారు.సరిగ్గా ఈ సమయంలో మోడీ తన రాజకీయ చతురతతో విద్యార్థులను ప్రత్యేక విమాన…
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సామాన్య ప్యాలెస్ లో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల ముఖ్య నాయకులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీలు సాయం బాపురావు, ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావులు పాల్గొన్నారు. జిల్లాల్లో సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. బాయిల్డ్ రైస్ కొంటామని కేంద్రం చెప్పిందని, రాష్ట్ర ప్రభుత్వం ధ్వంద్వ విధానం…
జగిత్యాల జిల్లా మాల్యాల మండలం రాంపూర్ గ్రామానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వెళ్లారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న బద్ధం నిహారిక కుటుంబ సభ్యులతో బండి సంజయ్ కుమార్ మాట్లాడారు. ఉక్రెయిన్ లో ఉన్న బద్దం నిహారిక తో వీడియో కాల్ లో మాట్లాడి అక్కడి పరిస్థితి ని అడిగి తెలుసుకున్నారు. రష్యా దాడులతో నిన్న రాత్రి నుండి భయం భయంగా గడుపుతున్నామని నిహారిక వాపోయారు. తాను ఉన్న దగ్గర పరిస్థితి కొంత…
కరీంనగర్ జిల్లా పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ.. బీజేపీ అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఎంతటి సీనియర్ నాయకులైనా సరే…. పార్టీ సిద్దాంతాలు, విధానాలకు లోబడి పనిచేయాల్సిందేనని ఆయన అన్నారు. అంతేకాకుండా కట్టుతప్పితే ఎంతటి వారైనా సరే… సహించే ప్రసక్తే లేదు. వేటు తప్పదు అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఏ పార్టీలోనైనా కొందరు నిత్య అసమ్మతి వాదులుంటరు. వారు పనిచేయరు. పనిచేసే వాళ్లపై అక్కసు గక్కడమే…
ఎంఐఎం దేశద్రోహుల పార్టీ అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ వ్యాఖ్యానించారు. దేశం ఎంఐఎం, దాని నాయకులకు ఆశ్రయం ఇచ్చిందని, వారిని పౌరులుగా గుర్తించిందని ఆయన అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మేడ్చల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. “వారు ఈ దేశం నుంచి ఫలాలను అనుభవిస్తున్నారు కానీ ఇతర దేశాలకు అనుకూలంగా మాట్లాడుతున్నారు.ఎంఐఎంను ఇక్కడి నుంచి ఎలా తరిమికొట్టాలో ఆలోచించాలి’’ అని ఆయన అన్నారు. తమతమ…
తెలంగాణలో టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు ఉంది. టీఆర్‌ఎస్ నేతలు బీజేపీ నాయకులపై విమర్శలు చేస్తుంటే.. అది కూడా డైరెక్టుగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి బీజేపై విమర్శల వర్ష కురిపిస్తున్నారు. దీంతో బీజేపీ నేతలు సైతం టీఆర్ఎస్ అధినేతతో సహా నేతలకు కౌంటర్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. హుజురాబాద్‌లో నన్ను ఓడిస్తారా అని అహంకార పూరితంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్ కుటుంబానికి ఉద్యమ కారులతో…