తెలంగాణ ప్రతి అభివృద్ధి పనిలో కేంద్రం పైసలే ఉన్నాయని, బీజేపీని విమర్శించడానికి టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి అర్హత లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘2023లో తెలంగాణలో భారతీయ జెండాను ఎగురవేస్తాం. నన్ను పార్లమెంటు సభ్యుడిగా గెలిపించినందుకు ప్రజలకు శిరస్సు వంచి నమస్కారం పెడుతున్నా.. తెలంగాణలో ధర్మం గురించి పాటుపడతానని బండి సంజయ్ తెలిపారు. దళిత బంధు సిరిసిల్లలో ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ఈరోజు తెలంగాణలో సర్పంచులు పరిస్థితి ఎలా…
బండి సంజయ్ మతాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. బండి సంజయ్ పాదయాత్ర లో బిజెపి సీఎంలు ఏం చేస్తున్నారో చెప్పాలి. సంజయ్ యాత్రలో ప్రజలు ఎక్కడా లేరు… బీజేపీ కార్యకర్తలు మాత్రమే ఉన్నారు అని తెలిపారు. ఇక 111 జీవో వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది… అది రాష్ట్రంకు సంబంధించిన విషయం కాదు. జితేందర్ రెడ్డితో పాటు మరికొంత మంది బీజేపీ నేతలకు 111 జీవో పరిధిలో…
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ పేరుతో చేపట్టిన పాదయాత్ర మొదటిరోజు ముగిసింది. అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలన విముక్తి కోసం తన పాదయాత్ర అని సంజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ ఓల్డ్ సిటీ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్ర ప్రారంభించిన ఆయన మెహిదీపట్నంలోని పుల్లారెడ్డి కాళేజీకి చేరుకున్నారు. రాత్రికి ఇక్కడే బసచేయనున్నారు. సంజయ్ బస కోసం బీజేపీ నాయకత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.…
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ను తెలంగాణ గౌడ సంఘాల సమన్వయ కమిటీ ఛైర్మన్ బాలగౌని బాలరాజు గౌడ్ ఆధ్వర్యంలో పలువురు గౌడ సంఘాల నాయకులు కలిశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371 జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలని ఆహ్వనించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో తక్షణమే కల్లుగీత కార్పొరేషన్ పాలకవర్గాన్ని ప్రకటించడంతోపాటు 5 వేల కోట్ల రూపాయల నిధిని కేటాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి…
తెలంగాణకు రూ.38,114 కోట్ల ‘ముద్ర’ రుణాలు మంజూరు అయ్యాయి. 47.26 లక్షల ఖాతాల్లోకి నిధులు జమ కానున్నాయి. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్దిక శాఖ సహాయ మంత్రి సమాధానం ఇస్తూ తెలంగాణ విషయానికొస్తే… “ప్రధాన మంత్రి ముద్ర యోజన” ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు గత ఆరేళ్లలో మొత్తం 47,26,819 మంది ఖాతాలకు రూ.38,114 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. వీటిలో 37,46,740 మంది రూ.50 వేలలోపు…
కరీంనగర్ జిల్లాలో ఫ్లెక్సీల వివాదం చోటు చేసుకుంది. కార్పొరేషన్ అధికారులకు బీజేపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు పార్టీ శ్రేణులు. అయితే నిబంధనలకు విరుద్దంగా ఫ్లెక్సీలను కట్టారని అధికారులు తొలగించారు. దాంతో ఆ సమయంలో వారిని అడ్డుకోని వాగ్వాదానికి దిగిన బీజేపీ నాయకులు… మా ఫ్లెక్సీలు ఎలా తొలగిస్తారంటూ అధికారులను ప్రశ్నించారు. ఆ సమయంలో…