సంగారెడ్డి జిల్లా కేంద్రం లోని కలెక్టరేట్ కార్యాలయం ముందు టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణుల వరి కొనుగోలు నిరసన కారక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టూరిజం, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండించిన పంటకు గిట్టు బాటు ధర లేకుండా వుండే కానీ 2014లో తెలంగాణ రాష్టం వచ్చాక ఈ రాష్టానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కోటి ఎకరాలు మాగాణి చేయడానికి గోదావరీ జలాలను ముఖ్యమంత్రి తెచ్చారని, ఆకలితో అలమటిస్తున్న దేశాల్లో మనం 101 స్థానంలో ఉన్నామన్నారు. ఢిల్లీకి మంత్రులు వెళ్తే పనీ పాట లేదా అని పీయూష్ గోయల్ అన్నారని, దిక్కు మాలిన మంత్రి దేశంలో ఉండాలా ఇంకా అంటూ ధ్వజమెత్తారు. మీకు నూకలు తినిపించే రోజులు దగ్గర లోనే ఉన్నాయని, ఈ రోజు తెలంగాణలో మూడు షిఫ్టుల పని చేసుకుంటూ కార్మికులు పని చేస్తున్నారన్నారు.
మీ గుజరాత్ రాష్టంలో 24 కరెంట్ ఉందా నీరూపిస్తారా అని ఆయన ప్రశ్నించారు. చట్ట పరంగా ఆహార ధాన్యాల నిల్వలు పరిశుభ్రత కొనుగోళ్లు జరపాలని చట్టాలు చేయడం జరిగిందని, రైతుల విషయంలో నల్ల చట్టాలు తేవడానికి సాహసం చేసి 3 బిల్లులు వెనక్కి తీసుకున్నారన్నారు. తెలంగాలలో 24 కరెంట్, నీళ్లు ఇస్తున్నామని, సంగారెడ్డి జిల్లాకు కొండ పొచ్చమ్మ సాగర్ నుంచి నీళ్లు తీసుక వచ్చి రైతులకు అంకితం చేయడానికి ముఖ్య మంత్రి కృషి చేస్తున్నారన్నారు. ప్రతి గ్రామంలో ట్రాక్టర్లు ఉన్న చరిత్ర తెలంగాణదని, తెలంగాణలో వరి ధాన్యం కొనకుంటే మీ అయ్యతో కొనిపిస్తమని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. చిల్లర మల్లర నాయకులు డ్రామాలు చేస్తున్నరు.. పీయూష్ గోయల్ బుద్ధి చెప్పే సమయం వచ్చిందని ఆయన ధ్వజమెత్తారు.