కృతి శెట్టి టాలీవుడ్‌లో 'ఉప్పెన' రూపంలో భారీ బ్లాక్‌బస్టర్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ''ఉప్పెన'' ఘనవిజయంతో కృతికి టాలీవుడ్‌లో ఆఫర్లు వెల్లువెత్తాయి, అయితే ఇటీవల ఆమె నటించిన చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. చాలా మంది యువ కథానాయికను అన్‌లక్కీ అంటూ ముద్ర వేశారు. కానీ నటి ఇప్పుడు సాలిడ్ హిట్‌తో తిరిగి వచ్చింది.
దుల్కర్ సల్మాన్ అటు మలయాళం ఇటు స్ట్రయిట్ తెలుగు సినిమాల షూటింగ్స్ తో బిజీబిజీగా ఉన్నాడు. మహానటి తో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సీతారామం తో సోలో హీరోగా స్ట్రయిట్ తెలుగు సినిమాతో సూపర్ హిట్ కొట్టి తెలుగులో మంచి మార్కట్ సెట్ చేసుకున్నాడు. ఆ కాన్ఫిడెంట్ తో లక్కీ భాస్కర్ అనే మరొక స్ట్రయిట్ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు దుల్కర్. తమిళ్ స్టార్ హీరో ధనుష్ ను తెలుగులో పరిచయం…
Rekha Nair Sensational Comments on Tamil industry Casting Couch: మలయాళ చిత్ర పరిశ్రమలో జరుగుతున్న లైంగిక వేధింపులను బట్టబయలు చేస్తూ హేమ కమిటీ నివేదికపై తమిళంలో పలు సినిమాలు చేసిన మలయాళ ప్రాంత నటి రేఖా నాయర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా అనేది మొదలైనప్పటి నుంచి లైంగిక వేధింపులు ఉన్నాయి. ఆ కాలంలో మీడియా డెవలప్‌మెంట్ లేకపోవడంతో ఈ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది సర్దుకుపోయేవారు అని అన్నారు. అదే సమయంలో ఆ…
ఇదిలా ఉంటే, తాజాగా హేమా కమిటీ నివేదికను మలయాళ స్టార్ హీరో, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ స్వాగతించారు. వరసగా మలయాళ నటులపై వస్తున్న లైంగిక ఆరోపణలతో ఇండస్ట్రీ టాప్ బాడీ అయిన అసోసియేషన్ ఆఫ్ మలమాళం మూవీ ఆర్టిస్ట్స్(అమ్మ)ని రద్దు చేస్తూ, దాని చీఫ్ అయిన మోహన్ లాల్ నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటి వరకు లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి మొత్తం 17 కేసులు నమోదయ్యాయి. ఈ పరిణామాలు మలయాల మూవీ ఆర్టిస్ట్ అసోసియేటన్ ‘‘అమ్మ’’ రద్దుకు దారి తీశాయి. ఈ వేధింపుల ఆరోపణల్లో పలువురు నటులని, నిర్మాతని ప్రశ్నించే అవకాశం ఉంది. 2013లో ఓ సినిమా సెట్‌లో ఒక నటుడు తనను వేధించాడని నటి సోనియా మల్హార్ తాజాగా ఫిర్యాదు చేశారు. కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)కి ఆమె ఫిర్యాదు చేశారు.
జేజేమ్మ, స్వీటీ అంటే టక్కున గుర్తుంచ్చేది మాత్రం అనుష్క శెట్టి.. ఆ పాత్రల్లో ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోవడం కష్టం.. భాగమతి సినిమా వరకు హ్యాట్రిక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత స్పీడును తగ్గించింది. అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. ఇటీవలే మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి చిత్రంతో అలరించారు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.. ఇప్పుడు మాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు…
Malavika Sreenath : కొన్ని సంవత్సరాల క్రితం ‘మీటూ’ ప్రచారం ద్వారా సినీ పరిశ్రమకు చెందిన మహిళలు ముఖ్యంగా నటీమణులు తమ లైంగిక వేధింపుల గురించి సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చారు. ఇందులో పలువురు సెలబ్రిటీల మరో ముఖం బయటపెట్టారు.
మాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ కమెడియన్ ప్రదీప్ కొట్టాయం గుండెపోటుతో కన్నుమూశారు. కేరళలో నివాసముంటున్న ఆయనకు బుధవారం అర్దరాత్రి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రదీప్ మరణ వార్త విన్న మాలీవుడ్ దిగ్బ్రాంతికి లోనైంది. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారం ట్విట్టర్ వేదికగా ప్రదీప్ ఆత్మకు శాంతి చేకూరాలని…
హీరోయిన్ వేధింపుల కేసులో మలయాళ నటుడు దిలీప్ కుమార్ కు ఉపశమనం లభించేలా కనిపించడం లేదు. గత కొన్ని రోజులుగా కేరళ హైకోర్టులో అనేక మలుపులు తిరుగుతున్న ఈ కేసులో దిలీప్ కుమార్ చుట్టూ మరింతగా ఉచ్చు బిగుస్తోంది. తాజా వార్త ఏమిటంటే, జనవరి 31న అంటే సోమవారం 10.15 నిమిషాల వరకు తన మొబైల్ ను కోర్టుకు అప్పగించాలని కేరళ హైకోర్టు దిలీప్‌ను ఆదేశించింది. ఈ విషయంలో న్యాయం జరిగేలా ప్రతి కోణంలో చూడాలని న్యాయస్థానం…