Rekha Nair: తమిళ లైంగిక వేధింపుల లిస్టు తీస్తే 500 మంది ఇరుక్కుంటారు.. నటి సంచలనం
- లైంగిక వేధింపులను బట్టబయలు చేస్తూ హేమ కమిటీ నివేదిక
- తమిళ సినిమాలో ఇలాంటి లైంగిక వేధింపులు లక్షల్లో ఉన్నాయి: రేఖా నాయర్
- నేను కనుక దాని గురించి మాట్లాడితే నాకు ఇక్కడ సినిమాల్లో ఛాన్స్ ఇక ఇవ్వరు: రేఖా నాయర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rekha Nair Sensational Comments on Tamil industry Casting Couch: మలయాళ చిత్ర పరిశ్రమలో జరుగుతున్న లైంగిక వేధింపులను బట్టబయలు చేస్తూ హేమ కమిటీ నివేదికపై తమిళంలో పలు సినిమాలు చేసిన మలయాళ ప్రాంత నటి రేఖా నాయర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా అనేది మొదలైనప్పటి నుంచి లైంగిక వేధింపులు ఉన్నాయి. ఆ కాలంలో మీడియా డెవలప్‌మెంట్ లేకపోవడంతో ఈ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది సర్దుకుపోయేవారు అని అన్నారు. అదే సమయంలో ఆ అడ్జస్ట్‌మెంట్‌కు తగ్గట్టు ఇమడలేక సినిమాల నుంచి తప్పుకున్న వాళ్లు చాలా మంది ఉన్నారని అన్నారు. తమిళ సినిమాలో ఇలాంటి లైంగిక వేధింపులు లక్షల్లో ఉన్నాయి.
Mohammed Shami: తుది జట్టు నుంచి తప్పించాలనే ఆలోచన మరోసారి రాకుండా చేశా: షమీ
Also Read
నేను కనుక దాని గురించి మాట్లాడితే నాకు ఇక్కడ సినిమాల్లో ఛాన్స్ ఇక ఇవ్వరు. అందుకే చాలా మంది నటీమణులు దీని గురించి మాట్లాడరు అని రేఖ అన్నారు. ఇక ఇప్పుడు మలయాళంలో కనీసం 10, 20 వికెట్లు పడతాయి. అదే తమిళ సినిమా లిస్ట్ చూస్తే 500, 600 వికెట్లు పడతాయి అని అన్నారు. సినీ పరిశ్రమలో ప్రతిభావంతులకు గౌరవం లేదు. బాగా నటించగల, డ్యాన్స్ చేయగల వారి కంటే చెప్పినపని చేసే వారికే ప్రాధాన్యత ఇస్తారు అన్నారు. ఇప్పుడు ఒక నటి దాని గురించి మాట్లాడితే ఇతర మగ నటుల వేధింపులకు గురైన వారు బయటకు వస్తారు కానీ అలా మాట్లాడే వారే లేరని ఆమె అన్నారు.
మలయాళంలో పీక్‌లో ఉన్న నటి ఇక్కడ వేధింపులు భరించలేక ఊరు నుంచి పారిపోయింది. ఇక ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకునే పరిస్థితిలో తమిళ సినీ సంఘాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తే ప్రశ్నార్థకమే. ఆఫీసుకు వెళితే అక్కడ ఉండరు. విశాల్ చెప్పుతో కొట్టమని చెప్పాడు, కానీ నేను అతను చెప్పేకంటే కంటే ముందే కొట్టాను. కానీ మీరు బాధితులను ఎలా చిత్రీకరిస్తారు, బాధితులను ఎక్కడ దాచారు అని ఆమె ప్రశ్నించారు. 2014లో ఓ రియాల్టీ షో ముగిసిన తర్వాత చాలా మంది మహిళలను నిర్వాహకులు తీసుకెళ్లారని అన్నారు. 10 ఏళ్లు గడిచినా ఇంకా అదే మాట మాట్లాడుకుంటున్నాం. ఒక్క మలయాళంలోనే కాదు, అన్ని భాషల సినిమాల్లో ఇలాంటి లైంగిక ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి అని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!